చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పని చేసిన ఇస్రో సైంటిస్ట్ రాకేశ్ నయ్యర్ బెంగళూరులోని క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్ల ముఖాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. రోజు ఉదయం వారికి టీ అందిస్తూ సంతోషాన్ని పెంచుతున్నారు. ఆయన ‘మిషన్ చాయ్’ కార్యక్రమంలో మరికొందరు కొలీగ్స్ కూడా చేరారు. గత ఏడేళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు. ఇప్పుడు 1500 మంది పేషెంట్లకు తన సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం టీ వరకే పరిమితం కాకుండా ఫుడ్ డొనేషన్లు, ఇతర అవసరాలను తీర్చడం వరకూ వెళ్లింది.
బెంగళూరులోని కిడ్వాయ్ క్యాన్సర్ హాస్పిటల్‌లో పేషెంట్లకు ఇస్రో సైంటిస్టు రాకేశ్ నయ్యర్ టీ అందిస్తూ ఆనందాలు, ఉత్సాహాలను నింపుతున్నారు. టీ కప్ అందిస్తూ నవ్వులనూ పంచుకుంటారు. వారితో ముచ్చటిస్తారు. రాకేశ్ నయ్యర్ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పని చేశారు. క్యాన్సర్ పేషెంట్ల రోజులు ప్రకాశవంతం చేయడంలో రాకేశ్ నయ్యర్ సంతోషాన్ని వెతుక్కుంటారు.
27
chandrayaan-3 - kidwai hospital
గత ఏడేళ్లుగా రాకేశ్ నయ్యర్ ఈ పని చేస్తూ క్యాన్సర్ పేషెంట్లలో సంతోషాన్ని పెంచుతున్నారు. వారి ఉదయాలను నవ్వులతో నింపుతున్నారు. చాయ్ అందిస్తూ ఒక ఉత్సాహాన్ని వారిలో నింపే ప్రయత్నం చేస్తున్నారు.
37
chandrayaan-3 - kidwai hospital
ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వీరిలో కంఫర్ట్ తీసుకురావడమే మిషన్ చాయ్ లక్ష్యంగా ఉన్నది. వంద మందితో మొదలైన ఈ మిషన్ ఇప్పుడు 1500 మందికి చాయ్ అందిస్తున్నది. మంజుల ద్వారా రాకేశ్ నయ్యర్ ఈ కార్యంలో చేరారు. ఆమె చంద్రయాన్ 3 కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌లో మంజుల పని చేస్తారు.
47
chandrayaan-3 - kidwai hospital
ప్రతి రోజు వారు మొత్తం రూ. 2,500 విలువైన బాదం పాలు, టీ, బిస్కెట్లు, పలు రకాల పండ్లను పేషెంట్లకు అందిస్తున్నారు.
సైంటిస్టు రాకేశ్ నయ్యర్ చేసిన చాయ్ అంటే ఇప్పుడు కిడ్వాయ్ క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు ఇష్టపడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే చంద్రయాన్ సక్సెస్ కావడంలో పని చేశాయని రాకేశ్ నయ్యర్ చెబుతారు.
57
chandrayaan-3 - kidwai hospital
రాకేశ్ ఈ పని చేయడానికి ప్రేరణగా నిలిచిన రోజులు దశాబ్దానికి పూర్వం ఉన్నాయి. తన మామ గంగరీన్ అనే వ్యాధితో కాలును కోల్పోవాల్సి వచ్చినప్పుడు తన అమ్మమ్మ ఆయనను పరామర్శించడానికి స్పిటల్ వెళ్లింది. ఆయన పంజాబ్ అమృత్‌సర్‌లోని హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఆయన వద్దకు వెళ్లి ఓ టీ అందించింది అమ్మమ్మ. ఈ చిన్ని పనితో తన మామయ్య ఎంతో ఆనందంగా మారారని రాకేశ్ గుర్తించారు. ఆ జ్ఞాపకం ఇప్పటికీ అతనిలో ఉన్నది. తన మామయ్య ఆనందపడ్డ క్షణాలు ఇప్పటికీ రాకేశ్ గుర్తు చేసుకుంటారు.
67
chandrayaan-3 - kidwai hospital
ఈ జ్ఞాపకాలతో టీ పట్టుకుని రాకేశ్ హాస్పిటల్ వెళ్లి క్యాన్సర్ పేషెంట్లకు అందిస్తుంటారు. ఆయన బెంగళూరులోని కిడ్వాయ్ హాస్పిటల్‌ను ఇందుకు ఎంచుకున్నారు. ఆ తర్వా మిషన్ చాయ్ సేవలను కడ్వాయ్ మాట్వా, సంజయ్ గాంధీ హాస్పిటల్, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే హాస్పిటల్‌కు కూడా విస్తరించారు.
77
chandrayaan-3 - kidwai hospital
ఈ మిషన్ చాయ్ 2016 ఆగస్టు 16వ తేదీన ప్రారంభమైంది. వీరు చాయ్ అందించడంతోపాటు పుట్టినరోజు వంటి వేడుకలకు ఫ్రూట్స్ కూడా అందిస్తున్నారు. ఒక వేళ ఎవరైనా మరణిస్తే డెడ్ బాడీని ట్రాన్స్‌పోర్ట్ చేసే, ఇతర ఖర్చులను వీరు భరిస్తున్నారు.