రైళ్లు పగలు వెలుగులో కంటే రాత్రి చిమ్మచీకటిలో వేగంగా వెళతాయి... ఎందుకో తెలుసా...?

First Published | Aug 26, 2024, 11:06 PM IST

మీరు రైలు ప్రయాణం చేసే సమయంలో ఓ విషయం గమనించారు. పగలు రాత్రి అని తేడాలేకుండా నిత్యం రైళ్లు ప్రయాణిస్తుంటాయి... కానీ పగటిపూట కంటే రాత్రి సమయంలో రైలు చాాలా వేగంగా వెళతాయి... ఇందుకు కారణమేంటో తెలుసా..?

Indian Railway

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను భారతీయ రైల్వే గమ్యస్థానాలకు చేరుస్తుంది. పేద, మద్యతరగతి ప్రజలు వందలు, వేల కిలోమీటర్లను కూడా రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అయితే రైలు ప్రయాణంలో ఓ విషయం ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా వుంటుంది.  పగటి సమయంతో పోలిస్తే రాత్రి సమయంలో రైళ్లు చాలా వేగంగా వెళుతుంటాయి. ఇలా ఎందుకు వేగంగా ప్రయాణిస్తాయో మీకు తెలుసా?

Indian Railway

పగటి సమయంతో పోలిస్తే రాత్రి సమయంలో రైళ్లు ఎందుకు వేగంగా ప్రయాణించడానికి సింపుల్ రీజన్ జన సంచారం. రాత్రి సమయంలో రైలు పట్టాలు, పరిసరాల్లో జన సంచారం వుండదు.... కాబట్టి రైలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతాయి. 

Latest Videos


Indian Railway

ఇక రైలు పట్టాల నిర్వహణ పనులు కూడా పగటిపూటే జరిగేది. ఏదయినా మార్గంలో ఇలాంటి పనులు జరుగుతుంటే పూర్తయ్యే వరకు ఆ మార్గంలో రైళ్లను నిలిపివేస్తారు. ఈ ప్రభావం రైళ్ల వేగంపై పడుతుంది. 

Indian Railway

పగటిపూట రైల్వే సిగ్నల్ దగ్గరకు వెళ్లేవరకు కనిపించదు. కాబట్టి సిగ్నల్స్ దగ్గర రైలు వేగం తగ్గించాల్సి వస్తుంది. కానీ రాత్రి సమయంలో రైలు నడిపే లోకో పైలట్ దూరం నుండే సిగ్నల్‌ను చూడగలడు. దీనివల్ల చాలా సందర్భాలలో వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల రైలు నిరంతరం వేగంగా ప్రయాణించగలుగుతుంది.

Indian Railway

రాత్రివేళ రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ వుండదు. రైలు ఎక్కేవాళ్లు, దిగేవాళ్లు తక్కువమంది వుంటారు. కాబట్టి స్టేషన్లలో కూడా ఎక్కువసేపు రైలు నిలిపే అవసరం వుండదు. కాబట్టి ప్రయాణం వేగంగా సాగుతుంది. 

click me!