భారత దేశంలోనే అత్యంత మురికి రైలు ఏదో తెలుసా?

First Published | Aug 24, 2024, 10:15 PM IST

గతంలో పోలిస్తే రైల్వే శాఖ తీరులో చాలా మార్పు వచ్చింది. రైల్వేస్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా వుంచేందుకు అనేక చర్యలు చేపడుతోంది. కానీ కొన్ని రైళ్లలో మాత్రం పరిశుభ్రత అన్న పదమే వినిపించదు. ఇలా అత్యంత మురికి రైలు ఏదో తెలుసా..?  

భారతీయ రైల్వేలు

భారతీయ రైల్వేలు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. కానీ కొన్ని రైళ్లలో రద్దీ కారణంగా అది సాధ్యం కావడంలేదు. ఇలాంటి రైళ్లలో ప్రయాణం నరకమే అని చెప్పాలి. ప్రయాణికుల అనుభవాలు, ఫిర్యాదుల ఆధారంగా భారతదేశంలోని అత్యంత మురికి రైళ్లను గుర్తించవచ్చు. 

మురికి రైలు

కొన్ని రైళ్లలో ఒక్కసారి ప్రయాణించారంటే మరోసారి ఆ రైలు ఎక్కడానికే ఇష్టపడరు... అంతటి చెత్త రైళ్లు కొన్ని వున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణం ఒక పీడకల అని ప్రయాణికులు అంటున్నారు.

Latest Videos


రైలు ఫిర్యాదులు

ప్రయాణికులు కొన్ని రైళ్ల గురించి అధికారులకు అనేక ఫిర్యాదులు చేస్తుంటారు. సదరు రైళ్లలో పేరుకుపోయే చెత్త, తద్వారా భరించలేనంత దుర్వాసన వస్తుందని ఫిర్యాదు చేసినా పరిస్థితి మారదు. ఎందుకంటే ఆ పరిస్థితిని ప్రయాణికులే కారణం కాబట్టి.

రైళ్ల జాబితా

దేశవ్యాప్తంగా వివిధ మార్గాలను కవర్ చేసే కొన్ని మురికి రైళ్ల జాబితా ఇక్కడ ఉంది.  ఈ జాబితా ప్రయాణికుల అనుభవాల ఆధారంగా రూపొందించబడింది. 

సహర్స-అమృత్ సర్ గరీబ్ రథ్

బీహార్, పంజాబ్‌లను కలిపే కీలకమైన రైలు సహర్స-అమృత్ సర్ గరీబ్ రథ్. ఈ రైలు పరిశుభ్రత విషయంలో చాలా చెడ్డపేరు సంపాదించుకుంది. ఇది దేశంలోని అత్యంత మురికి రైళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది.

సీమాంచల్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుండి జోగ్బాని వరకు నడుస్తుంది. ఈ రైలు పరిశుభ్రత గురించి ప్రయాణికుల నుండి రైల్వేశాఖకు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ రైల్లో పేరుకుపోయిన చెత్త, దుర్వాాసనతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదులు అందుతుంటాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రైలు పరిస్థితి ప్రతిరోజూ అలాగే వుంటుంది. 

వైష్ణోదేవి - బాంద్రా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు కూడా మురికి రైళ్ల జాబితాలో ఉంది, దీని పరిశుభ్రత గురించి చాలా మంది ఫిర్యాదు చేశారు. 2023లో, ఈ రైలు గురించి రైల్వేకి 61 ఫిర్యాదులు వచ్చాయి.

ఫిరోజ్‌పూర్-అగర్తలా-త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్

ఈ రైలు కూడా మురికి రైళ్లలో ఒకటి. ఇందులో ప్రయాణించేవారు రైల్వే శాఖకు చాలా ఫిర్యాదులు చేస్తుంటారు. కేవలం పేరుకే ఇది సుందరి ఎక్స్‌ప్రెస్ అంటూ ప్రయాణికులు కామెంట్స్ చేస్తుంటారు. 

అజ్మీర్-జమ్మూ తావి పూజా ఎక్స్‌ప్రెస్

ఈ రైలు కూడా ఒక మురికి రైలు. వేరే మార్గం లేకపోతేనే ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తారు. టాయిలెట్ నుండి వచ్చే దుర్వాసన మొత్తం బోగీలో వ్యాపిస్తుంది.

click me!