liquor cost: గోవాలో లిక్కర్ ధరలు ఎందుకు తక్కువ?

Published : May 06, 2025, 05:18 PM IST

liquor cost India: దేశంలోనే అత్యధిక మద్యం ధరలు కర్నాటకలో ఉన్నాయి. ఇక గోవాలో అయితే, దేశంలో అతితక్కువ మద్యం ధరలు ఉంటాయి. భారత్ లో వివిధ రాష్ట్రాల్లో మద్యం ధరల్లో తేడాలు ఎందుకు ఉంటాయి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.    

PREV
16
liquor cost: గోవాలో లిక్కర్ ధరలు ఎందుకు తక్కువ?

liquor cost India: భారతదేశంలో మద్యం ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరేవేరుగా ఉంటాయి. బ్రాండ్ ఒక్కటైనా ధరల్లో మార్పులు కనిపిస్తుంటాయి. ఇలా వివిధ రాష్ట్రాలను బట్టి లిక్కర్ ధరలు ఎందుకు భిన్నంగా ఉంటాయనే అంశంపై తాజా గణాంకాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.

ఉదాహరణకు, జేమ్సన్ విస్కీ బాటిల్ కర్ణాటకలో రూ. 3495, తెలంగాణలో రూ. 2700, హర్యానాలో మాత్రం రూ. 1800కి లభిస్తోంది. దీనికి కారణం ప్రతి రాష్ట్రం విధించే ఎక్సైజ్ పన్నుల వ్యత్యాసమే.

26

ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, మద్యంపై కర్ణాటకలో 80% ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం.

మరోవైపు, గోవాలో చాలా తక్కువ. అందుకే ఇక్కడ 55% పన్నుతో మద్యం అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో గోవాలో పన్ను కొద్దిగా పెరిగినప్పటికీ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు ఇప్పటికీ గోవాలోనే తక్కువ.

36

పన్నుల ప్రభావం మద్యం రిటైల్ ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు జానీ వాకర్ రెడ్ లేబుల్ (750 మిల్లీ) ఢిల్లీలో రూ. 1400, గోవాలో రూ. 1650, బెంగళూరులో రూ. 1700, హైదరాబాదులో రూ. 2400 గా ఉంది. బ్లాక్ లేబుల్ విస్కీ ఢిల్లీలో రూ. 3310, ముంబైలో రూ. 4200, కర్ణాటకలో సుమారు రూ. 5200గా ఉంది. 

ఈ భారీ ధర వ్యత్యాసం “ఒక దేశం-ఒక పన్ను” సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మద్యం పరిశ్రమ అభిప్రాయపడుతోంది. పరిశ్రమ రిపీట్ గా పన్ను వ్యవస్థలో సమగ్ర మార్పులు కోరుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని చెబుతోంది. 
 

46

పన్నుల కారణంగా మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రాలు దాటుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రాలకు ఆదాయ నష్టాలు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థకు చెందిన దీపక్ రాయ్ మాట్లాడుతూ, "ఒకసారిగా వర్తించే పన్ను విధానం లేకపోవడం పరిశ్రమ ఎదుగుదలకే అడ్డుగా మారుతోంది" అని తెలిపారు.
 

56

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల బీర్‌పై ఎక్సైజ్ పన్ను రేటును తయారీ వ్యయానికి 205%గా పెంచింది. ఇదివరకు ఇది 195%గా ఉండేది. అదనంగా, అదనపు ఎక్సైజ్ డ్యూటీలో 10% పెంపు కూడా ప్రతిపాదించింది. ఈ కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం, ప్రీమియం లేదా దిగుమతి బీరు బ్రాండ్ల ధర బాటిల్‌కు సుమారు ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది.
 

66

ఈ పెంపు గత మూడేళ్లలో బీరు పైన ఇది మూడవసారి పన్ను పెంపుగా నమోదైంది. జనవరి 2025లో సైతం బీరు పన్ను పెంచిన నేపథ్యంలో, ఈ తాజా నిర్ణయం మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఈ వ్యవస్థలో ఏకరీతి లేకపోవడం వల్ల వినియోగదారులు, ఉత్పత్తిదారులు రెండింటికీ భారం తప్పడం లేదు. మద్యం రంగానికి స్థిరమైన పన్ను విధానం అవసరం అని పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు మద్యం డిమాండ్ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిని ఆదాయ వనరుగా చూస్తూ ధరలు పెంచుతున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories