భార్య ప్రశ్నకు సజ్జాద్ బదులిస్తూ.. తన రంగుపై తానే సెటైర్ వేసుకున్నారు. "రంగు ముఖ్యం కాదు, హృదయంతో ప్రేమించాలి" అని భార్యను చూపిస్తూ చెబుతాడు. అంటే తన భార్య తనకంటే తెల్లగా ఉన్నా తనను ప్రేమిస్తోందని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాడు. ఇక అంతటితో ఆగకుండా "ఇంత అందమైన భార్య ఉంటే, ప్రజలకు చూపించకూడదా?" అని భార్యతో ప్రశ్నించాడు.
ఇక కాసేపటికి గదిలో లైట్ ఆఫ్ చేసినప్పుడు భార్య మాత్రమే కనిపించడం ఫన్నీగా ఉంది. "చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మీరు నన్ను చూస్తున్నారా లేదా అనేది ముఖ్యం కాదు, నా భార్య నాతో ఉంటే చాలు. ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, సంతోషంగా ఉండండి" అని వీడియోను ముగించాడు.