సౌతిండియాలో పాపులర్‌ టెలివిజన్‌ ఛానెల్‌ ఏదో తెలుసా?

First Published Aug 30, 2024, 10:54 PM IST

ఎన్ని సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చినా.. టీవీ స్థానం టీవీదే. టెలివిజన్ ఛానెళ్లు అందించే ప్రత్యేక కంటెంట్ కారణంగా వాటి స్థానం వాటిదే అని చెప్పాలి. ఎందుకంటే.. దాదాపు మూడు దశాబ్దాలుగా సౌతిండియాలో టీవీ ఛానెళ్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మరి సౌతిండియాలో పాపులర్ టెలివిజన్ ఛానెల్ ఏదో తెలుసా..?

టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడంతా స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలతో ఓటీటీల వెంట పరుగెడుతున్నారు. తమకు నచ్చిన సినిమాలు, షోలను చూసి ఆనందిస్తున్నారు. అయితే, ఎన్ని ఓటీటీలు వచ్చినా.. టీవీ ఛానెళ్ల స్థానం వాటిదే అని చెప్పాలి. ఎందుకంటే.. దాదాపు మూడు దశాబ్దాలుగా సౌతిండియాలో టీవీ ఛానెళ్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. 

మరి సౌత్‌ ఇండియాలో పాపులర్‌, ఇంకా మొదటి టీవీ ఛానెల్‌ ఏదో తెలుసా..? దాని ప్రస్థానం ఎలా, ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు ఏ స్టేజ్‌లో తెలుసుకోవాలని ఉందా..!!

Asianet

ముందుగా.. మళయాళంలో మూడు దశాబ్దాల వార్తలు అందిస్తోంది ఏషియానెట్‌ టీవీ. మలయాళం ప్రారంభమైన ఈ తొలి ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ తాజాగా 31వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అగ్రగామి మలయాళ టెలివిజన్ ఛానల్ అయిన ఏషియానెట్ కొన్నేళ్లుగా ఏషియానెట్ ప్లస్, ఏషియానెట్ గ్లోబల్ లాంటి బహుళ ఛానళ్ల ద్వారా ప్రసారాలు అందిస్తోంది. 1993 ఆగస్టు 30న ఒక ప్రత్యేక వార్తా ఛానెల్‌గా ప్రారంభమైన ఏషియానెట్ న్యూస్.. దాని 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 31వ వసంతంలోకి అడుగుపెట్టిన ఏషియానెట్‌ మలయాళ విజువల్ మీడియా పరిశ్రమ లీడర్‌గా కొనసాగుతోంది.

1993 ఆగస్టు 30న తిరువనంతపురంలోని సెనేట్ హాల్‌లో జరిగిన ప్రారంభోత్సవంతో ఏషియానెట్ మలయాళంలో కొత్త దృశ్య మాధ్యమ సంస్కృతికి నాంది పలికింది. పి.భాస్కరన్, ఎస్.శశికుమార్ సహా మలయాళ సాహిత్య, సాంస్కృతిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖుల నేతృత్వంలో ఈ ఛానల్ ప్రారంభమైంది. మొదట్లో ఏషియానెట్ రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే ప్రసారమయ్యేది. కేవలం వినోదం, ఎడ్యుకేషనల్ కంటెంట్‌ ప్రసారం చేసేది. 1995 సెప్టెంబరు 30న ఛానల్ అరగంట వార్తా బులెటిన్‌ని ప్రసారం చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత వార్తా ప్రసారంలో దాని పరిధిని విస్తరించింది. మొదట్లో ఎంటర్టైన్మెంట్, న్యూస్ ఛానెల్‌గా ఎదిగిన ఏషియానెట్... అనతికాలంలోనే మలయాళీలకు ఫేవరెట్‌గా మారింది. చివరికి, ఛానెల్ తన ప్రసారాన్ని రోజుకు 24 గంటలకు విస్తరించింది.
ఏషియానెట్ ప్లస్, ఏషియానెట్ గ్లోబల్ లాంటి ఛానళ్లను ఏషియానెట్ నిర్వహిస్తోంది. అలాగే, ఏషియానెట్ న్యూస్ ఒక ప్రత్యేక వార్తా ఛానెల్ కూడా. ఇవన్నీ మలయాళీల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఛానల్స్ అభివృద్ధి చెందడంతో, ఏషియానెట్, ఏషియానెట్ న్యూస్ వేర్వేరు సంస్థలుగా విడిపోయాయి. 31వ సంవత్సరంలోనూ ఏషియానెట్, ఏషియానెట్ న్యూస్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విజువల్‌ మీడియా రంగంలో ముందంజలో ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ రంగంలోనూ ఏషియానెట్ దూసుకెళ్తోంది. సౌతిండియాలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, ఇంగ్లీష్, ఇతర భాషల్లోనూ డిజిటల్ మీడియా రంగంలో సేవలు అందిస్తోంది.  

Latest Videos


Sun TV

ఇక, తమిళంలో సన్‌ టీవీ మొట్టమొదటిది. సన్ టీవీ అనేది సన్ టీవీ నెట్‌వర్క్ ఫ్లాగ్‌షిప్ ఛానెల్. తమిళ నూతన సంవత్సరం ఏప్రిల్ 14న 1993లో సన్‌ టీవీ ప్రారంభమైంది. దేశంలో మొట్టమొదటి స్వతంత్ర టెలివిజన్ ఛానెల్ అయిన ఆసియా టెలివిజన్ నెట్‌వర్క్ (ATN) శాటిలైట్‌ ద్వారా సన్‌ టీవీ ప్రసారమైంది. ఆ తర్వాత సొంతంగా అభివృద్ధి చెంది... కేటీవీ, సన్ మ్యూజిక్, ఆదిత్య టీవీ, సన్ న్యూస్, సన్ లైఫ్, చుట్టి టీవీ లాంటి ఛానెళ్ల ద్వారా ప్రసారాలు అందిస్తోంది. 

ETV

తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఛానెల్ దురదర్శన (డీడీ) సప్తగిరి 1993లో ప్రారంభమవగా.. తొలి తెలుగు ప్రైవేట్‌ ఛానెల్‌ ఈనాడు టెలివిజన్‌ (ఈటీవీ) ప్రారంభమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన ఈ ఛానెల్‌.. న్యూస్‌తో ఎంటర్టైన్మెంట్‌, బాల వినోదం తదితర రకాలుగా ప్రేక్షకులకు సేవలు అందిస్తోంది. ఈనాడు గ్రూప్ 2015లో ఈటీవీ లైఫ్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా పేరుతో నాలుగో కొత్త ఛానళ్లను ప్రారంభించింది. కాగా, 2014లో ప్రారంభమైన ఈటీవీ 2ని ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణగా మార్చారు. ఇక 2018లో మరికొన్ని ఛానెళ్లను ఈటీవీ ప్రారంభించింది.

click me!