జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ట లైవ్ చూడాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే...

First Published | Jan 16, 2024, 12:20 PM IST

జనవరి 22 ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా అనేకమంది ఎంపిక చేసిన ప్రముఖులు హాజరవుతారు. దీంతో పాటు వెయ్యిమంది సాధువులు, రామమందిరాన్ని నిర్మించిన కార్మికులు హాజరవుతారు. 

అయోధ్య : అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరం ఎట్టకేలకూ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని జరుపుకోబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సమయం దగ్గరపడుతోంది. ఈ కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని.. జన్మధన్యం చేసుకోవాలనుకునేవారు చాలామందే ఉంటారు. అయితే, జనవరి 22న ఆహ్వానితులకు తప్ప వేరేవారికి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండదు. 

ram mandir facts 02

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తుల కోసం అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 

Latest Videos


ఇంట్లో కూర్చుని అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడొచ్చు. డీడీ న్యూస్ లో ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానుంది. మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద ఎల్ ఈడీ స్క్రీన్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎంబసీలు, కాన్సులేట్ లలో లైవ్ టెలికాస్ట్ ప్రసారం అవుతుంది. అలాగే న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో కూడా లైవ్ టెలికాస్ట్ జరగనుంది. 

జనవరి 22 ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా అనేకమంది ఎంపిక చేసిన ప్రముఖులు హాజరవుతారు. దీంతో పాటు వెయ్యిమంది సాధువులు, రామమందిరాన్ని నిర్మించిన కార్మికులు హాజరవుతారు. 

వీరే కాకుండా ఏడువేల మంది సినీ, రాజకీయ, వ్యాపార.. వివిధ రంగాల్లోని ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. వీరందరూ ఆ రోజు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్నిచూడచ్చు.

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన సంప్రదాయాలు మంగళవారం జనవరి 16నుంచి ప్రారంభమవుతాయి. ఓ వారం ముందే ఈ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. 

click me!