Ayodhya ram mandir ramlala murti - arun yogiraj
అయోధ్య : నేటినుంచి అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు మొదలవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య లోని అమావా రామాలయం రెండున్నర కిలోల బంగారు విల్లును తయారుచేయించింది.
ayodhya ram temple
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అమావా రామాలయం నుంచి ఈ బంగారు విల్లు అందనుంది. ఈ మేరకు ఆలయ అధికారులు తెలిపారు.
రెండున్నర కిలోల బంగారంతో తయారుచేసిన ఈ విల్లును చెన్నైకి చెందిన ఇద్దరు కళాకారులు రూపొందించారు. ఈ విల్లు మీద వాల్మీకీ రామాయంలోని అనేక ఘట్టాలను సూక్ష్మ రూపంలో అందంగా చిత్రీకరించారు.
అయోధ్యలోని రామాలయ ప్రాణప్రతిష్టకు సంబంధించిన 11 రోజుల కార్యక్రమాన్ని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
పురాణాలు, వేదాల్లో తెలిపిన విధంగా అత్యంత శ్రద్ధతో.. నియమాలను ఫాలో అవుతూ చేసే ప్రక్రియ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం సిద్ధం అవుతుంది.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మికంగా ఈ ప్రక్రియకోసం సిద్ధం అవుతున్నారు. నిష్టం నియమాలు ఫాలో అవుతున్నారు.
ప్రాణప్రతిష్ట అంటే.. బౌతికంగా తయారు చేసిన విగ్రహానికి ఆథ్యాత్మికతను, దైవాత్వాన్ని తీసుకువచ్చే ప్రక్రియ. గ్రంథాల్లో చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో ఉపవాసాలతో ఈ కార్యక్రమాన్ని ఫాలో అవ్వాలి.
నరేంద్ర మోడీ ఈ 11 రోజుల ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఉపవాసాలతో ఆ క్రతువుకు సిద్ధం అవుతున్నారు. ఇది రాముడు, రామాలయం మీద ప్రధానికి ఉన్న నిబద్ధతతను తెలుపుతుంది.