2 సెకండ్ల వీడియోకు 100 మిలియ‌న్ వ్యూస్‌.. అస‌లీ వీడియోలో అంత‌లా ఏముంద‌బ్బా.?

Published : Nov 23, 2025, 09:37 AM IST

Viral Video: సోష‌ల్ మీడియాలో ఎప్పుడెది వైర‌ల్ అవుతుందో తెలియ‌దు. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. కేవ‌లం 2 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఏకంగా 100 మిలియ‌న్ల వ్యూస్ రావ‌డం విశేషం. ఇంత‌కీ వీడియోలో అంత‌లా ఏముందంటే.. 

PREV
14
మేక‌ప్ ఏట్ టుడే అనే క్యాప్ష‌న్‌తో

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో రెండు సెకన్ల మేకప్ క్లిప్‌తో ఒక అమ్మాయి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమెను ఇప్పుడు అందరూ Bandana Girl అని పిలుస్తున్నారు. ఆమె అసలు యూజర్ నేమ్ Bud Wiser, పేరు ప్రియంగా. న‌వంబ‌ర్ 2వ తేదీన ఆటోలో కూర్చుని "Makeup ate today" అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేసింది. ఆమె అప్పుడు ఆ వీడియోకి 1,000 లైకులు వస్తాయని మాత్రమే అనుకుంది. కానీ 20 రోజుల్లో ఆ చిన్న వీడియోకి 100 మిలియ‌న్ వ్యూస్ దాటాయి.

24
ఎందుకు వైరల్ అయిందో ఎవరికి తెలియదు

ఈ వీడియో ఎందుకు ఇంతగా వైరల్ అయిందో ఇప్పటివరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. మేకప్ వీడియోలు సాధారణం. కానీ ఇది మాత్రం ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. నెటిజ‌న్లు ఈ వీడియోపై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇంత చిన్న వీడియోకు ఇన్ని వ్యూస్ ఎందుకు వ‌చ్చాయి. ఎక్స్ ఆల్గ‌రిథ‌మ్‌ను చెక్ చేసుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

34
ఎంత ఆదాయం వ‌చ్చి ఉండొచ్చు.?

ఇక కొంతమంది X యూజర్లు ఆమె పోస్టు ద్వారా వచ్చే డబ్బు గురించి అంచనాలు వేస్తున్నారు. ఈ 2 సెకండ్ల వీడియోకు ఆమెకు ఏకంగా రూ. 3.7 ల‌క్ష‌ల ఆదాయం రావొచ్చ‌ని అంటున్నారు. ఇక ఈ వీడియోను 23,000 మందికి పైగా రీషేర్ చేశారు. త‌మ అకౌంట్‌లో కూడా వైర‌ల్ అవుతుంద‌న్న ఆశ‌తో ఇలా చేశారు.

44
ఇంత‌కీ ప్రియంగా స్పంద‌న ఏంటంటే.?

వీడియో వైర‌ల్ అవ్వ‌డంపై ప్రియంగా ఆశ్చర్యపోయింది. ఈ విష‌య‌మై ఆమె మాట్లాడుతూ..“నాకు ఇంకా నమ్మశక్యం కావడం లేదు. నాకు 1,000 లైకులు వస్తాయని మాత్రమే అనిపించింది. ఇప్పుడు ఇది నా చేతుల్లో లేదు.” ఇక త‌న వీడియో ఏఐతో చేసిందంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తుండ‌డంపై స్పందించిన ప్రియంగా.. “నా గురించి మీరు చేసే కామెంట్లు చూస్తుంటే షాక్ అవుతుంది. నేను ఒక నిజమైన మనిషిని. దయచేసి ఊహలతో తీర్పు ఇవ్వ‌ద్దు.” అని రాసుకొచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories