మీరు కూడా రైళ్ల‌లో సమోసాలను ఇష్టంగా తింటారా.? ఈ వీడియో చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్ల‌రు

Published : Jun 06, 2026, 07:16 PM IST

Viral Video: రైలు ప్రయాణాల్లో చాలా మంది టీ, కాఫీ, సమోసా వంటి చిరుతిండ్లను ఇష్టంగా తింటుంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ముంబై-హౌరా మెయిల్ రైలుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. 

PREV
15
వైరల్ వీడియోలో ఏముంది?

ముంబై సీఎస్‌టీ నుంచి హౌరాకు వెళ్లే ముంబై-హౌరా మెయిల్ రైలుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఒక వ్యక్తి సమోసాలను తన కాళ్ల కింద ఉంచుకున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితుల్లో నిర్వహించడం ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రమాదకరం అని విమర్శలు వెల్లువెత్తాయి.

25
రైల్వే విచారణలో బయటపడిన నిజాలు

వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఈ వీడియో సుమారు నాలుగు రోజుల క్రితం తీసినదిగా గుర్తించారు. అలాగే వీడియోలో కనిపించిన వ్యక్తి అధికారిక రైల్వే ఉద్యోగి కాదని, అనధికారికంగా విక్రయాలు చేస్తున్న వెండర్ అని తేలింది. దీంతో ఈ ఘటనను రైల్వే శాఖ అత్యంత సీరియస్‌గా తీసుకుంది.

35
వెండర్‌పై కఠిన చర్యలు

ప్రయాణికులకు అందించే ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేసిన అధికారులు సంబంధిత వెండర్‌పై చర్యలు తీసుకున్నారు. అతడిపై జరిమానా విధించడంతో పాటు వెంటనే విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని రైల్వే అధికారులు తెలిపారు.

45
ప్రయాణికుల ఆరోగ్యంపై రాజీ లేదన్న రైల్వే

ఈ ఘటన తర్వాత రైల్వే శాఖ ఆహార నాణ్యత, పరిశుభ్రత అంశాలపై మరింత దృష్టి సారించింది. రైళ్లలో విక్రయించే ఆహార పదార్థాలపై తనిఖీలు కఠినతరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని, నాణ్యత ప్రమాణాలను పాటించని వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

55
సోషల్ మీడియాలో ఆగ్రహం

ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలామంది ప్రయాణికులు రైళ్లలో విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు. రైల్వే క్యాటరింగ్ సేవలపై మరింత పర్యవేక్షణ అవసరం అని, ఆహార పదార్థాలను ప్రతిరోజూ తనిఖీ చేసే వ్యవస్థను బలోపేతం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికుల ఆరోగ్యం, ఆహార భద్రత అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories