Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో

Published : Mar 07, 2026, 09:50 AM IST

Viral Video: చ‌లికాలంలో దాచుకున్న పాములు వేసవి మొద‌లు కాగానే బ‌య‌ట‌కు వ‌స్తాయి. చ‌ల్ల‌టి ప్ర‌దేశాల‌ను వెతుక్కుని అక్క‌డ త‌ల‌దాచుకుంటాయి. అడ‌పాద‌డ‌పా క‌నిపించి అంద‌రినీ భ‌య‌పెడుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘ‌ట‌న కేర‌ళ‌లో జ‌రిగింది. 

PREV
15
బెడ్‌రూమ్‌లో అనుమానాస్పద కదలిక

ఈ సంఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. టెక్నోపార్క్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న మాధవ్ జే. పనిక్కర్ తన ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లినప్పుడు ఏసీ యూనిట్ దగ్గర ఏదో కదలిక కనిపించింది. దగ్గరగా గమనించగా ఒక పాము తోక లోపలికి వెళ్తున్న‌ట్లు కనిపించింది. దీంతో వెంటనే అనుమానం వచ్చి జాగ్రత్తగా పరిశీలించాడు.

25
ఏసీ లోపల నుంచి వినిపించిన శబ్దం

మాధవ్ ఏసీ దగ్గర చెవిని పెట్టి వినగానే లోపల ఏదో కదులుతున్నట్టు శబ్దం వినిపించింది. అప్పటికే పాము శరీర భాగం కూడా కనిపించడంతో భయపడ్డాడు. వెంటనే స్నేక్ క్యాచ‌ర్‌కు కాల్ చేశాడు. అయితే అత‌నికి కాల్ క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో వెంట‌నే అటవీ శాఖకు సమాచారం ఇచ్చాడు.

35
ఏసీ ఓపెన్ చేయ‌గానే షాకింగ్ దృశ్యం

అటవీ శాఖ సమాచారం అందుకున్న వెంటనే సర్ప అనే సంస్థకు చెందిన స్నేక్ క్యాచర్ గౌతమ్ అక్కడికి చేరుకున్నాడు. ఏసీ టెక్నీషియన్‌ను పిలిపించి యూనిట్‌ను జాగ్రత్తగా తెరిచారు. అందులో ఒక్కటి కాదు, రెండు కాదు… మొత్తం ఐదు పాములు ఉన్నట్టు గుర్తించారు. అవి “కోబేరి” లేదా “విల్లున్ని” అనే జాతికి చెందిన విషంలేని పాములు అని చెప్పారు.

45
నాలుగు పాములు పట్టుబడ్డాయి… ఒకటి పారిపోయింది

దాదాపు గంటన్నర పాటు శ్రమించి నాలుగు పాములను సురక్షితంగా పట్టుకున్నారు. అయితే ఒక పాము మాత్రం ఏసీ అవుటర్ పైప్ పక్కగా బయటికి జారి పారిపోయింది. దీంతో కొంతసేపు అక్కడే వెతికారు. కానీ పాము క‌నిపించ‌కుండా పోయింది. 

55
ఇంత‌కీ ఎలా వ‌చ్చాయి.?

ఈ పాములు ఏసీ అవుటర్ వాటర్ పైప్ దగ్గర గోడలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు గౌతమ్ తెలిపారు. ఇంటి టెర్రస్ వద్ద చెట్ల కొమ్మలు చాలా దగ్గరగా ఉండటం వల్ల పాములు అక్కడి నుంచి వచ్చి గోడ రంధ్రం ద్వారా ఏసీలోకి చేరినట్టు చెప్పారు. పట్టుకున్న పాములను తర్వాత అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఈ సంఘటనతో ఇంట్లో ఏసీ యూనిట్‌ల దగ్గర గోడల్లో ఉన్న చిన్న రంధ్రాలు కూడా ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటి చుట్టూ చెట్ల కొమ్మలు ఎక్కువగా దగ్గరగా ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories