Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ

Published : Jan 22, 2026, 04:17 PM IST

Top 10 Richest Politicians in India : భారతదేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరో తెలుసా..? టాప్ 10 ధనిక ఎమ్మెల్యేల్లో నలుగురు తెలుగువారే… ఇందులో ఓ మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. ఆమె ఎవరో తెలుసా? 

PREV
110
భారతదేశంలో టాప్ 10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేలు..

Richest Politicians in India : భారతదేశంలో కోట్లు సంపాదించే ఉద్యోగాలున్నాయి... వేలకోట్లు కూడబెట్టే వ్యాపారాలున్నాయి. కానీ సమాజంలో గొప్ప పేరు, చేతిలో పవర్ తో పాటు భారీగా సంపాదన కలిగిన రాజకీయాలంటేనే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు యువత రాజకీయాలపై అనాసక్తి చూపించేవారుకాదు... కానీ ప్రస్తుతం యువ పాలిటిషన్స్ సంఖ్య పెరుగుతోంది. గత పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది యువత చట్టసభలకు ఎన్నికయ్యారు.

యువత రాజకీయాలపై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం కొందరు సీనియర్ల నాయకుల ఆస్తిపాస్తులు. తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సామాన్య రైతు కుటుంబాలనుండి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం గొప్ప నాయకులుగా ఎదిగారు.. ఇదేక్రమంలో వందలకోట్లు ఆస్తిపాస్తులు కూడబెట్టారు.

దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులు వందలు, వేల కోట్లకు పడగెత్తారు. ఇలాంటి ధనిక నాయకులు ఏ స్థాయిలో ఆస్తిపాస్తులు కలిగివున్నారో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రతిసారి ప్రకటిస్తుంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఈ రిపోర్ట్ రెడీచేస్తారు.. దీని ప్రకారం భారతదేశంలో టాప్ 10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల లిస్ట్... వారి ఆస్తిపాస్తుల గురించి తెలుసుకుందాం.

210
1. పరాగ్ షా (మహారాష్ట్ర ఎమ్మెల్యే)

భారతదేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే పరాగ్ షా. ఈయన మహారాష్ట్ర ముంబై సబర్బన్ జిల్లాలోని ఘట్కోపర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈయన ఆస్తిపాస్తుల విలువ దాదాపు రూ.3,383 కోట్లుగా చూపించారు. పరాగ్ షా అధికార బిజెపి ఎమ్మెల్యే.

310
2. డికె. శివకుమార్ (కర్ణాటక ఎమ్మెల్యే)

డికె శివకుమార్... దేశ రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ పేరు తప్పకుండా వినివుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఈయన కీలకపాత్ర పోషించారు. రాజకీయంగానే కాదు ఆర్థికంగాను పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇలా ఓ పార్టీని నడిపించగల స్థాయి ధనవంతుడు డికె. శివకుమార్. ఆయన ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం... కనకపుర అసెంబ్లీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. డికె ఆస్తిపాస్తుల విలువ రూ.1413 కోట్లుగా ఏడిఆర్ వెల్లడించింది.

410
3. కేహెచ్. పుట్టస్వామి (కర్ణాటక ఎమ్మెల్యే)

దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో మూడోస్థానంలో నిలిచారు మరో కన్నడ ఎమ్మెల్యే కేహెచ్. పుట్టస్వామి గౌడ. గౌరిబిదనూరు నుండి ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచిన సత్తా ఈ ఎమ్మెల్యేది. ఈయన ఆస్తుల విలువ రూ.1467 కోట్లు ఉంటుందని ఏడిఆర్ తెలిపింది.

510
4. ప్రియకృష్ణ (కర్ణాటక ఎమ్మెల్యే)

భారతదేశంలో టాప్ 4 ధనిక ఎమ్మెల్యేల్లో ముగ్గురు కర్ణాటకకు చెందినవారే. గోవిందరాజ్ నగర్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియకృష్ణ రూ.1156 కోట్ల ఆస్తులతో నాలుగు స్థానంలో నిలిచారు. ఆయన మాజీ మంత్రి ఎం. కృష్ణప్ప కుమారుడు... తండ్రి నుండి సంక్రమించిన ఆస్తులతో పాటు సొంతంగా సంపాదించుకున్నారు. దీంతో దేశంలోని ధనిక ఎమ్మెల్యేల్లో ఒకరిగా మారారు.

610
5. నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే)

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే టాప్ 5 ధనిక ఎమ్మెల్యేల్లో చోటు దక్కించుకున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు ఇప్పుడు వందలకోట్లకు అధిపతి... రాజకీయాలతో పాటు వివిధ వ్యాపారాల ద్వారా ఆయన ఈస్థాయిలో ఆస్తులు కూడబెట్టారు. కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు ఆస్తుల విలువ రూ.931 కోట్లుగా ఉంటుందని ఏడీఆర్ రిపోర్ట్ బైటపెడుతోంది.

710
6. నారాయణ ( ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే)

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ కూడా ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన ఆస్తిపాస్తుల విలువ రూ.824 కోట్లు ఉంటుంది.

810
7. వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే)

ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం, వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. పులివెందుల నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ఆస్తిపాస్తుల విలువ రూ.757 కోట్లు ఉంటుంది.

910
8. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ( ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యే)

గతంలో వైసిపిలో కొనసాగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం టిడిపి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె పేరిట రూ.716 కోట్లు ఆస్తిపాస్తులు ఉన్నాయి.

1010
టాప్ 9, 10 స్థానంలో నిలిచిన ఎమ్మెల్యేలు

9.జయంతిభాయ్ పటేల్ (గుజరాత్ ఎమ్మెల్యే)

దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల్లో టాప్ 7 దక్షిణాదికి చెందినవారే. తొమ్మిదో స్థానంలో మాత్రం గుజరాత్ కు చెందిన జయంతిభాయ్ పటేల్ నిలిచారు. ఆయన ఆస్తిపాస్తులు రూ.661 కోట్లు.

10. సురేషా బిఎఫ్ (కర్ణాటక ఎమ్మెల్యే)

భారతదేశంలో టాప్ 10 రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో చివరిస్థానంలో నిలిచారు కర్ణాటకకు చెందిన సురేషా బిఎస్. ఆయన ఆస్తులు రూ.648 కోట్లు.

Read more Photos on
click me!

Recommended Stories