Viral News: భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా E20 పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక కారు ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ చుట్టూ చీమలు తిరుగుతూ కనిపించాయి. ఆ క్యాప్‌పై E20 స్టికర్ కూడా ఉండటంతో, E20 పెట్రోల్‌లో ఇథనాల్ ఉండటం వల్ల చీమలు ఆకర్షితమవుతున్నాయని కొందరు ప్రచారం చేశారు. ఈ వీడియో వేగంగా వైరల్ కావడంతో చాలా మంది వినియోగదారులు నిజంగానే E20 పెట్రోల్ వల్ల ఇలాంటి సమస్య వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
25
BPCL ఏమి చెప్పింది?
ఈ ప్రచారంపై BPCL స్పష్టమైన వివరణ ఇచ్చింది. E20 పెట్రోల్ కారణంగా చీమలు రావడం పూర్తిగా తప్పుడు ప్రచారం అని కంపెనీ తెలిపింది. ఇంధనంలో ఉపయోగించే ఇథనాల్ అనేక శుద్ధి ప్రక్రియల తర్వాత తయారవుతుందని పేర్కొంది. ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్ వంటి ప్రక్రియల ద్వారా ఇథనాల్‌లో ఉండే చక్కెర వంటి పదార్థాలు పూర్తిగా తొలగిస్తారని వివరించింది. అందువల్ల చీమలను ఆకర్షించే అంశాలు అందులో ఉండవని స్పష్టం చేసింది.
BPCL has examined the claims circulating on social media regarding ants congregating around vehicle fuel filler caps and their alleged association with E20 petrol.
Fuel-grade ethanol used for petrol blending is produced through fermentation and distillation processes that… pic.twitter.com/1qED7xBBhe
— Bharat Petroleum (@BPCLimited) June 17, 2026
35
ఇథనాల్‌లో చీమలను ఆకర్షించే పదార్థాలు ఉండవా?
BPCL ప్రకారం, పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ "డినేచర్డ్ ఎథనాల్" రూపంలో ఉంటుంది. అంటే దానిలో ప్రత్యేక రసాయనాలు కలపడం వల్ల అది తాగడానికి అనువుగా ఉండదు. అలాగే ఈ రసాయనాలు కీటకాలను ఆకర్షించే లక్షణాలు కూడా కలిగి ఉండవు. అంతేకాకుండా E20 పెట్రోల్ వాసన కూడా సాధారణ పెట్రోల్ వాసనలాగే ఉంటుందని, చీమలు లేదా ఇతర కీటకాలను ప్రత్యేకంగా ఆకర్షించే గుణం లేదని కంపెనీ వెల్లడించింది.
E20 అనేది 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఇంధనం. దేశంలో ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రోత్సహిస్తోంది. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. దీంతో రైతులకు కూడా అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తున్నాయి.
55
పర్యావరణానికి E20 ఎలా ఉపయోగపడుతుంది?
E20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు కొంత మేర తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అనేక కొత్త వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగా తయారవుతున్నాయి. పాత వాహనాల్లో ఉపయోగించినప్పుడు మైలేజీలో స్వల్ప మార్పులు కనిపించవచ్చని చెబుతున్నప్పటికీ, సాధారణ వినియోగదారులకు పెద్దగా ఇబ్బందులు ఉండవని ఆటోమొబైల్ నిపుణులు పేర్కొంటున్నారు.