Free LPG Gas : ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలి?

Published : Jun 18, 2026, 11:49 AM IST

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 3.0 పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, పొయ్యి సబ్సిడీపై లభిస్తుంది. ఉచిత గ్యాస్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు?   

PREV
16
ఉచిత గ్యాస్ స్కీమ్

వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న వేళ పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊరట ఇస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana 3.0) కింద ఉచితంగా గ్యాస్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ తో పాటు మొదటి సిలిండర్‌ కొనుగోలుకు ఆర్థిక సాయం, గ్యాస్ సబ్సిడీ వంటి అనేక ప్రయోజనాలు అందిస్తోంది.

కట్టెలు, బొగ్గు వంటి పాత పద్ధతుల్లో వంట చేసే కుటుంబాలను, స్వచ్ఛమైన ఎల్పీజీ వంట గ్యాస్‌కు మార్చడమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ముఖ్య ఉద్దేశం. దీనివల్ల మహిళల ఆరోగ్యం బాగుపడటంతో పాటు, వంట పని కూడా సులభం అవుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉజ్వల యోజన 3.0 ద్వారా కొత్త లబ్ధిదారులకు కూడా ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తోంది ప్రభుత్వం.

26
ఉ పథకం కింద అర్హులైన మహిళలకు లభించే ప్రయోజనాలు
  • ఉచిత LPG కనెక్షన్, మహిళల పేరు మీదే LPG కనెక్షన్ జారీ
  • మొదటి సిలిండర్, రెగ్యులేటర్‌కు ఆర్థిక సాయం
  • గ్యాస్ స్టవ్ కొనుగోలుకు ఆర్థిక సహాయం
  • అర్హత ఉన్న ప్రతి సిలిండర్‌పై రూ.300 వరకు సబ్సిడీ 
36
ఉచిత గ్యాస్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
  • మహిళలకు 18 ఏళ్లు లేదా ఆపై వయసు ఉండాలి. 
  • కుటుంబంలో అప్పటికే LPG కనెక్షన్ ఉండకూడదు. 
  • ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందినవారై ఉండాలి. 
  • ప్రభుత్వ అర్హత జాబితాలో పేరు ఉండాలి.
46
ఈ వర్గాల వారికే ఉచిత గ్యాస్
  •  SC/ST కుటుంబాలు
  • అంత్యోదయ అన్న యోజన (AAY) రేషన్ కార్డుదారులు
  • ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) లబ్ధిదారులు
  • గిరిజన కుటుంబాలు
  • తేయాకు తోట కార్మికుల కుటుంబాలు
  • దీవులలో నివసించేవారు
  • వలస కార్మికుల కుటుంబాలు
  •  ప్రభుత్వం గుర్తించిన ఇతర పేద కుటుంబాలు.
56
దరఖాస్తు చేసేటప్పుడు సాధారణంగా అవసరమయ్యే డాక్యుమెంట్లు
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • బ్యాంకు ఖాతా వివరాలు
  • చిరునామా ధ్రువీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • మొబైల్ నంబర్.
66
ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు ప్రక్రియ

ఉజ్వల యోజన 3.0కు దరఖాస్తు చేయాలనుకునే వారు దగ్గర్లోని LPG డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో నేరుగా అప్లై చేసుకోవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన డాక్యుమెంట్లతో పాటు సమర్పించవచ్చు. మీ దరఖాస్తును పరిశీలించి, అర్హత ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఉచిత ఎల్పీజీ కనెక్షన్ మంజూరు చేస్తారు.

ఉజ్వల యోజన కేవలం ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పథకం మాత్రమే కాదు... కట్టెల పొయ్యి, బొగ్గు పొగ వల్ల వచ్చే శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో, మహిళల వంట సమయాన్ని ఆదా చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మహిళల పేరు మీదే ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వడం వల్ల వారి సామాజిక, ఆర్థిక సాధికారతకు కూడా ఈ పథకం దోహదపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories