టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట

Published : Dec 31, 2025, 07:34 PM IST

యూపీ ప్రభుత్వం 2035 నాటికి 100% మురుగునీటిని తిరిగి ఉపయోగించుకునేలా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ శుద్ధి చేసిన నీటిని వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర పనులకు వాడతారు. ఈ పథకం నీటి సంరక్షణ, సుస్థిర అభివృద్ధి దిశగా ఒక పెద్ద ముందడుగు.

PREV
16
యోగి టార్గెట్ @2035

యూపీని జల భద్రత, సుస్థిర అభివృద్ధిలో ముందుంచేందుకు సీఎం యోగి నేతృత్వంలో చారిత్రక అడుగు పడుతోంది. 2030 నాటికి 50%, 2035 నాటికి 100% మురుగునీటిని సురక్షితంగా తిరిగి వాడాలని లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. 

26
యోగి విజన్ ఇదే...

సీఎం యోగి విజన్‌తో మురుగునీరు ఇక భారం కాదు, ఆర్థిక వనరుగా మారనుంది. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలు, వ్యవసాయం, ఇతర అవసరాలకు వాడతారు. ఇది భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

36
మురుగునీటి నిర్వహణకు రోడ్ మ్యాప్

సీఎం యోగి నాయకత్వంలో నదుల పరిరక్షణకు అద్భుతమైన పనులు జరుగుతున్నాయని రాష్ట్ర స్వచ్ఛ గంగా మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ తెలిపారు. యోగి ప్రభుత్వం మురుగునీటి నిర్వహణకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది.

46
మురుగునీటి శుద్ది

సీఎం యోగి నాయకత్వంలో యూపీ నీటి సంరక్షణ, నిర్వహణలో జాతీయ మోడల్‌గా ఎదుగుతోందని జోగిందర్ సింగ్ అన్నారు. యోగి ప్రభుత్వం మురుగునీటిని అభివృద్ధి వనరుగా మార్చబోతోంది.

56
ఇదీ ప్లాన్
  • మొదటి దశ (2025–30): STP ఉన్నచోట 50% మురుగునీటి పునర్వినియోగం.
  • రెండో దశ (2030–35): ఈ ప్రాంతాల్లో 100% పునర్వినియోగం.
  • మూడో దశ (2045 నాటికి): దశలవారీగా 30%, 50%, చివరకు 100% వినియోగం.
66
మురుగునీటి నిర్వహణలో యూపీ దేశానికే ఆదర్శం

సీఎం యోగి ఆదేశాలతో పట్టణ, గ్రామీణ, తాగడానికి వీల్లేని నీటి వాడకానికి వేర్వేరు ప్రణాళికలు చేస్తున్నారు. నీటి సంరక్షణతో పాటు ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తారు. యూపీ నీటి నిర్వహణలో మోడల్‌గా మారనుంది.

Read more Photos on
click me!

Recommended Stories