Usha Chilukuri: అమెరికాకి కాబోయే సెకండ్ లేడీ మన తెలుగమ్మాయే.. ఉషా చిలుకూరి గురించి తెలుసుకుందాం

Published : Jul 20, 2024, 03:17 PM ISTUpdated : Jul 20, 2024, 03:33 PM IST

ఉషా చిలుకూరి.. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ సతీమణి. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ గెలిస్తే అమెరికా సెకండ్ లేడీగా అవతరించబోతున్నారు. అమెరికా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఉషా చిలుకూరి మన తెలుగమ్మాయే.. 

PREV
16
Usha Chilukuri: అమెరికాకి కాబోయే సెకండ్ లేడీ మన తెలుగమ్మాయే.. ఉషా చిలుకూరి గురించి తెలుసుకుందాం
America Elections Trump vs Biden

రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తుండగా.. ఆయనకు ఎక్కువ మంది అమెరికన్లు మద్దతిస్తున్నారు. ఇక, తన రన్‌మేట్‌గా, రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా సెనేటర్‌ జేడీ వాన్స్‌ పేరును ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఆయన సతీమణి, భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది.

26
Usha Chilukuri

కాగా, ఈ ఏడాది నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి జేడీ వాన్స్ గెలిస్తే.. ఉషా చిలుకూరి తొలి ఇండో-అమెరికన్ సెకండ్‌ లేడీగా రికార్డుల్లోకి ఎక్కుతారు. వాన్స్- ఉషలది ప్రేమ వివాహం. వాన్స్‌ విజయ ప్రస్థానంలో ఉష పాత్ర ఎంతో కీలకం. 

36
Usha Chilukuri

ఉషా చిలుకూరిది అచ్చమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం. ఆమె తల్లిదండ్రులు రాధాకృష్ణ చిలుకూరి (క్రిష్‌ చిలుకూరి), లక్ష్మీ చిలుకూరి. కాగా, ఉషా శాన్‌డియాగోలోని కాలిఫోర్నియాలో పుట్టి పెరిగారు. ఉషా తల్లిదండ్రులిద్దరూ ప్రొఫెసర్లు. తండ్రి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు గ్రామం, తల్లిది పామర్రు. 

46
Usha Chilakuri

జేడీ వాన్స్ యేల్ లా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఉషా చిలుకూరి కూడా అదే యూనివర్సిటీ నుంచి హిస్టరీలో డిగ్రీ పొందారు. 214లో ఉషా డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్నారు. అయితే, క్రమంగా ట్రంప్‌కి అనుచరులుగా మారిపోయారు.

56

ఉషకు విశాఖపట్నంలో బంధువులున్నారు. 90 ఏళ్ల వయసులోనూ పాఠాలు చెబుతూ పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‌ శాంతమ్మకు వరసకు మనవరాలు అవుతారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలోనూ ఉష మూలాలున్నాయి. ఆమె పూర్వీకులు దశాబ్దాల క్రితమే కృష్ణా జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 

66

ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్‌ రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికయ్యే వరకు వారి గురించి సొంతూరులో ఎవరికీ తెలియదు. వార్తల్లో చూసి అందరూ తెలుసుకున్నారు. ఉషా చిలుకూరి కారణంగా తమ ఊరి గురించి ప్రపంచమంతా తెలుస్తోందని ఆనందపడుతున్నారు వడ్లూరు గ్రామస్థులు.

Read more Photos on
click me!

Recommended Stories