పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ... ఇంత అట్టహాసంగా రాధికను ఎందుకు పెళ్ళాడాడంటే...

Published : Jul 19, 2024, 06:14 PM ISTUpdated : Jul 19, 2024, 06:25 PM IST

అసలు పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ ప్రపంచమే నివ్వెరపోయేలా పెళ్లి చేసుకున్నారు. అసలు అనంత్ ఎందుకు పెళ్లి వద్దనుకున్నారో తెలుసా..? 

PREV
15
పెళ్లే వద్దనుకున్న అనంత్ అంబానీ... ఇంత అట్టహాసంగా రాధికను ఎందుకు పెళ్ళాడాడంటే...
Anant Ambani Radhika Merchant Wedding

Anant Ambani Radhika Merchant Wedding : ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లివేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖేష్-నీతా అంబాని దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తాను ఇష్టపడ్డ రాధికా మర్చంట్ ను పెళ్లాడాడు. ఆకాశమే పందిరి, భూలోకమే పీటలు అన్నట్లుగా అట్టహాసంగా ఈ వివాహ వేడుక జరిగింది. భారతీయ సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అంతర్జాతీయ అతిథులు కూడా అనంత్, రాధిక పెళ్లికి హాజరయ్యారు. కొడుకు పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఏకంగా ఐదు వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.   

25
Anant Ambani Radhika Merchant Wedding

ఇలా చిరకాలం గుర్తుండిపోయేలా ఎంతో అట్టహాసంగా అనంత్,రాధిక పెళ్లి జరిగింది. గత కొద్ది రోజులుగా అంబానీల ఇంట జరిగిన పెళ్లి వేడుకే వరల్డ్ వైల్డ్ హాట్ టాపిక్. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర రాజకీయ, సినీతారలు, వ్యాపార ప్రముఖులు, అంబానీ కుటుంబసభ్యులు, అనంత్, రాధిక ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.  ఎందులో చూసినా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలే చక్కర్లు కొడుతున్నారు. ఇలా అంబరాన్నంటే సంబరాల మధ్య మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు అనంత్, రాధిక జంట. 

35
Anant Ambani Radhika Merchant Wedding

అయితే ఈ పెళ్లి సందర్భంగా అనంత్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఇందులో అనంత్ అంబానీ తన పెళ్లి, పెళ్లాడబోయే రాధిక గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. చిన్నపుడు అసలు పెళ్లే చేసుకోవద్దని... జీవితాంతం జంతుసేవ చేసుకోవాలని అనుకునేవాడట అనంత్. ఈ విషయాన్ని చాలాసార్లు తల్లిదండ్రులు ముఖేష్, నీతాలకు కూడా చెప్పాడట. కానీ రాధికతో పరిచయం తర్వాాత తన ఆలోచన మారిందని అనంత్ తెలిపాడు.  
 

45
Anant Ambani Radhika Merchant Wedding

 రాధిక మర్చంట్ తో పరిచయం తనకు పెళ్ళిపై వున్న అభిప్రాయాన్ని మార్చేసిందన్నారు. తనలాగే రాధిక కూడా మంచి జంతు ప్రేమికురాలు. సేవాగుణం ఎక్కువ. ఇలా తనలాంటి ఆలోచనలనే కలిగిన ఆమెను తాను ఇష్టపడ్డానని అనంత్ తెలిపారు. ఆమెతో పరిచయం తర్వాత పెళ్లి చేసుకోవద్దనే తన ఆలోచనలో మార్చు వచ్చిందని... ఇలాంటి అమ్మాయి దొరకడం అద‌ృష్టమని అనంత్ తెలిపారు.

55
Anant Ambani Radhika Merchant Wedding

ఇక తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కఠిన సమయంలో రాధిక అండగా నిలిచిందని అనంత్ తెలిపారు. తనకు ఆమె కొండంత ధైర్యం ఇచ్చేదన్నారు. తనకు నచ్చిన... తనను మెచ్చిన అమ్మాయినే పెళ్ళాడుతున్నట్లు అనంత్ అంబానీ తెలిపారు. 


 

click me!

Recommended Stories