Mukesh Ambani
Mukesh Ambani : మనం ఎంత ఎక్కువగా డబ్బులు ఖర్చుచేస్తే అంతగా ఆస్తులు తగ్గుతాయి. బిజినెస్ లేదంటే ఇతర పద్దతుల్లో ఎక్కడయినా పెట్టుబడి పెడితే ఓకే... ఆ డబ్బు తిరిగి మనకు వస్తుందన్న ఆశ వుంటుంది. కానీ పెళ్లిళ్లు, వేడుకలు, విహారయాత్రలు, లగ్జరీ జీవితం ... ఇలాంటివాటిపై పెట్టే ఖర్చు తిరిగిరాదు. కానీ ఇదంతా సామాన్యుల విషయంలోనే... ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీకి ఇది వర్తించదని అర్థమవుతోంది.
Mukesh Ambani
ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ ఇంట పెళ్లిభాజా మోగింది. కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే నివ్వెరపోయేలా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం అట్టహాసంగా జరిగింది. చిన్నకొడుకు పెళ్లిని ముఖేష్, నీతా దంపతులు ఎంతో వైభవోపేతంగా జరిపించారు.
Mukesh Ambani
ఆకాశమే పందిరి, భూలోకమే వేదిక అన్నట్లుగా అనంత్, రాధిక వివాహం జరిగింది. దాదాపు నాలుగైదు నెలలనుండే ఈ పెళ్లి సందడి మొదలయ్యింది. జామ్ నగర్, యూరప్ లో ప్రీవెడ్డింగ్ వేడుకలు... ఇటీవల ముంబైలోనాలుగైదు రోజులపాటు పెళ్లి జరిగింది. అంబానీల పెళ్ళి వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని రాజకీయ, సినీ,వ్యాపార ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన విఐపిలందరూ పాల్గొన్నారు.
Mukesh Ambani
అనంత్, రాధిక పెళ్లికోసం అంబానీ కుటుంబం ఏకంగా రూ.5 వేల కోట్లను ఖర్చు చేసినట్లు సమాచారం. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చే ఈ పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్ళలో అనంత్, రాధిక పెళ్లి టాప్ లో నిలిచింది.
Mukesh Ambani
కొడుకు పెళ్లికి ముఖేష్ అంబానీ వేలకోట్లు ఖర్చుచేసాడు... కాబట్టి ఆయన ఆస్తి తగ్గివుంటుందని ఎవరైనా అనుకుంటాం. డబ్బులు ఖర్చయితే ఎంత అపర కుబేరుల ఆస్తులైనా ఎంతో కొంత తగ్గుతాయి. కానీ అంబానీల పెళ్లి విషయంలో ఇలా జరగలేదు సరికదా ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది.
Mukesh Ambani
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి జూలై 12న జరిగింది. అయితే ఈ పెళ్లికి ముందు అంటే జూలై 5న అంబానీ నెట్ వర్త్ 118 బిలియన్ డాలర్లుగా వుంది. కానీ అనంత్ పెళ్ళినాటికి ఇది 121 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది.
Mukesh Ambani
ఇలా ముఖేష్ అంబానీ నెట్ వర్త్ భారీగా పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ పెరగడమే కారణం. అనంత్, రాధిక పెళ్లిరోజునే ఈ షేర్ల విలువ 1శాతం పెరిగింది. దీంతో ముఖేష్ సంపద పెరిగి ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 12వ స్థానంలో వున్న ఆయన 11 స్థానానికి చేరారు. ఇక భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ.
Mukesh Ambani
ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ పెరగడం, ప్రపంచ సంపన్నుల జాబితాలో ఓ స్థానం మెరుగుపర్చుకోవడం కొత్తకోడలు వచ్చిన వేళావిశేషమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాధిక మర్చంట్ అంబానీ కుటుంబంలోకి మరింత లక్ ను మోసుకువచ్చిందని కొందరు... అదృష్టాన్ని తీసుకువచ్చిందని మరికొందరు అంటున్నారు. ఇలా రాధిక మర్చంట్ రాకతో అంబానీల ఆస్తి పెరగడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.