కేంద్ర మంత్రిగా అన్నామలై?
తమిళనాడు బిజెపి అధ్యక్షుడి మార్పు ప్రకటన వేళ కేంద్రమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అన్నామలై పనితీరును ప్రశంసించిన ఆయన భవిష్యత్ లో మరింత ఉన్నత పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు బిజెపి అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నామలైని రాజ్యసభకు నామినేట్ చేసి నరేంద్ర మోదీ కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లోపే ఈ ప్రక్రియను పూర్తిచేసే ఆలోచనలో బిజెపి అదిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఆంధ్ర ప్రదేశ్ నుండి అన్నామలైని రాజ్యసభకు పంపేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ప్రస్తుతం ఎన్డిఏ కూటమి అధికారంలో ఉంది... కాబట్టి మిత్రపక్షాలైన టిడిపి, జనసేనను ఒప్పించి అన్నామలైని రాజ్యసభకు పంపాలను బిజెపి చూస్తోందట. ప్రస్తుతం డిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రతిపాదనను బిజెపి ఉంచినట్లు సమాచారం. అన్నీ సక్రమంగా జరిగితే రాజ్యసభ నుండి ఎంపీగానే కాదు కేంద్ర మంత్రిగా కూడా అన్నామలైకి అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
అన్నామలై కోసం టిడిపి, జనసేన పార్టీలతో బిజెపి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిమధ్య ఒప్పందం కుదిరితే అన్నామలై ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. తదుపరి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో అన్నామలైకి మంత్రివర్గ బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం.