మీరు విదేశాల్లో చదువు, ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? : ఈ 10 దేశాల్లో అద్భుత అవకాశాలు

First Published | Jul 25, 2024, 10:12 AM IST

విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగం ఇప్పుడు చాలామంది భారతీయుల కల. ఇలాంటివారు ఏ దేశంలో ఎలాంటి విద్య, ఉద్యోగావకాశాలు వున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వివరాలు మీకోసం...  

Study Abroad

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని మెజారిటీ యువత కోరిక. ఇండియాలో ఇంజనీరింగ్ లేదా ఇతర డిగ్రీ స్థాయి కోర్సులు పూర్తికాగానే విదేశాలకు వెళ్లేందుకు సిద్దమవుతుంటారు. ఇలా ఉన్నత విద్యకోసం వెళ్లి అక్కడే సెటిల్ కావాలని కోరుకునేవారు చాలామంది వుంటారు. మన తెలుగు రాష్ట్రాలను నుండి కూడా ప్రతిఏటా వేలాదిమంది యువత విదేశాలకు వెళుతున్నారు. 
 

Study Abroad

అయితే కొందరు విద్యార్థులు సరైన గైడెన్స్ లేక విదేశాలకు వెళ్లాక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మనం ఏ దేశానికి వెళుతున్నాము..? అక్కడ ఎలాంటి సౌకర్యాలుంటాయి..? ఎలాంటి విద్యాసంస్థలున్నాయి..? అడ్మిషన్ ప్రాసెస్ ఎలా వుంటుంది? ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ విద్యాభ్యాసం ముగించడం ఎలా..? చదువు తర్వాత ఉద్యోగావకాశాలు ఎలా వున్నాయి..? ఇలాంటి వివరాలన్ని తెలుసుకుని వెళితే మంచింది. 
 


Study Abroad

అయితే ఇప్పటివరకు ఇండియన్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్నిదేశాల్లో ఉన్నతవిద్య ముగించి ఉద్యోగాలు చేస్తున్నారు. కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు కూడా ఇలాంటి దేశాలనే ఎంచుకుంటే మంచింది. అక్కడ అల్రెడీ మనవాళ్లు వున్నారు కాబట్టి ఇబ్బందులు ఎదురయినా ఎలా పరిష్కరించుకోవాలో తెలుస్తుంది. మొత్తంగా 2024 ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారు ఈ 10 దేశాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. 
 

USA

అమెరికా (USA) : 

భారతీయ విద్యార్థులు డ్రీమ్ కంట్రీ అమెరికా. మనోళ్లు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఎక్కువగా అమెరికాకే వెళుతుంటారు. అక్కడి ప్రతిష్టాత్మక హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి యూనివర్సటీల్లో చదవాలని కలలు కంటుంటారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీ కలిగిన యూఎస్ఐ లో జాబ్ తమ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుందని నమ్మకం. అందుకో ఇండియాలో మంచి జాబ్స్ వున్న వదిలిపెట్టి అక్కడికి వెళుతున్నారు.ఇలా విద్యా, ఉపాధి కోసం భారత్ నుండి అమెరికాకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. విద్యార్థులకు కూడా చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే సదుపాయం వుంటుంది... చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసుకుని స్థిరపడిపోయే అవకాశం వుంటుంది. కాబట్టి 2024 లో కూడా ఎక్కువమంది అమెరికాకు వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు.

Germany

జర్మనీ : 

భారతీయులు ఎక్కువగా వుండే దేశాల్లో జర్మనీ ఒకటి. ఇక్కడ ఇంజనీరింగ్, ఐటీ, సైన్స్ రంగాల్లో మంచి నైపుణ్యం కలిగిన స్కిల్డ్ వర్కర్స్ కు మంచి అవకాశాలున్నాయి. అలాగే ఉన్నత విద్యకోసం వెళ్లే విద్యార్థులకు ఇక్కడ ఎడ్యుకేషన్ కు అయ్యే ఖర్చు చాలా తక్కువ... తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్య దక్కుతుంది. ఆర్థికంగా చాలా బలంగా వున్న జర్మనీ చాలా బలంగా వుంది. దీంతో ఆ దేశానికి వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది కూడా ఎక్కువగానే వుంది. 
 

Australia

ఆస్ట్రేలియా

ప్రపంచంలో మంచి యూనివర్సిటీలు కలిగిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. అందుకే విదేశాల నుండి మరీ ముఖ్యంగా భారత్ నుండి ఇక్కడికి ఉన్నత చదువుల కోసం ఎక్కువగా వెళుతుంటారు. అలాగే ఆస్ట్రేలియాలో మంచి జీవనవిధానం వుంటుంది కాబట్టి చాలామంది ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడతారు. 
 

Canada

కెనడా : 

ఇతర దేశాలతో పోలిస్తే కెనడా వెళ్లడం చాలా ఈజీ. చాలా సున్నితంగా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ ముగుస్తుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువ. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఈ దేశం అక్కున చేర్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ మన భారతీయులు ఎక్కువగా వుంటారు.   

UK

యునైటెడ్ కింగ్డమ్ (యూకే) 

ఉన్నత విద్యకు గ్లోబల్ లీడర్ గా యూకేకు పెరుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి యూనివర్సిటీలు ఇక్కడివే. ఇక్కడ చదువు తర్వాత ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా వుంటుంది. అందువల్లే భారత విద్యార్థులు యూకే వెళ్లేందుకు మక్కువ చూపిస్తుంటారు. 
 

Singapore

సింగపూర్ : 

అంతర్జాతీయ వ్యాపారం మరియు ఫైనాన్స్ కు సింగపూర్ హబ్ గా మారింది. ఈ దేశం కూడా బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగివుంది. మిగతా అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ ఉద్యోగాలను పొందడం ఈజీ. ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. 
 

Netherland

నెదర్లాండ్ : 

ఈ దేశంలో నాణ్యమైన విద్య లభిస్తుంది. అందువల్లే ఇక్కడి విద్యావ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపును పొందింది. ఇక్కడ చాలా యూనివర్సిటీలు పూర్తిగా ఇంగ్లీష్ లోనే కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లోనే విద్యాభ్యాసం వల్ల ఇక్కడ చదివే విద్యార్థులకు ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు ఈజీగా వస్తాయి. నెదర్లాండ్ లో కూడా ఉద్యోగావకాశాలు బాగానే వుంటాయి. 

France

ప్రాన్స్

కల్చర్, ఆర్ట్ మరియు ఫ్యాషన్ కు ఫ్రాన్స్ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది. ఈ రంగాలకు ఇక్కడ విద్యావ్యవస్థలో ప్రాధాన్యత వుంటుంది. ఇక ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్ ఫీజు మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా వుంటుంది. 

Ireland

ఐర్లాండ్

పూర్తిగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో ఐర్లాండ్ ఒకటి. ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ, ఫార్మా రంగాల్లోని వారికి ఐర్లాండ్ లో మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి.
 

New Zealand

న్యూజిలాండ్

ఇండియన్స్ ఎక్కువగా వుండే దేశాల్లో న్యూజిల్యాండ్ ఒకటి.  ఈ దేశం ప్రకృతి అందాలకు నిలయం... కాబట్టి జీవన విధానం చాలా బాగుంటుంది. నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్ జాబ్స్ కు ఇక్కడ మంచి అవకాశాలుంటాయి. ఈ రంగాలవారికి ఇక్కడికి వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా పూర్తవుతుంది. 

Latest Videos

click me!