ఒక్కో స్టూడెంట్ కి రూ.10 లక్షలు ... బడ్జెట్ బంపరాఫర్

First Published | Jul 23, 2024, 6:21 PM IST

కేంద్ర బడ్జెట్ 2024-25 లో యువతకు పెద్దపీట వేసారు. యువత విద్య, ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించారు. ఇందులో భాగంగానే యువతకు రూ.10 లక్షల రుణం ఫ్రీగా ఇచ్చేందుకు సిద్దమైంది మోదీ సర్కార్. 

Union Budget 2024-25

Union Budget 2024-25 : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024-25 ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది. దేశ ప్రగతిలో కీలకభూమిక పోషించే 9 అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అందులో ఒకటి యువతకు ఉద్యోగ కల్పన మరియు నైపుణ్యాభివృద్ది. 
 

Union Budget 2024-25

యువతను ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుందని... వాటికోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూ.10 లక్షల వరకు విద్యారుణాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ రుణాలకు ఎలాంటి వడ్డీ వుండదని తెలిపారు. ఇలా దేశీయంగా కోరుకున్న విద్యను అభ్యసించేలా విద్యార్థులకు తోడ్పాటు అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. 
 


Union Budget 2024-25

ఇక మోదీ 3.O ప్రభుత్వ హయాంలో అంటే రానున్న ఐదేళ్లలో దాదాపు 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  500 టాప్ కంపనీలతో ఒప్పందం చేసుకుని అందులో ఇంటర్న్ షిప్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఇలా ప్రతిఏటా లక్షలమందిని ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇంటర్న్ షిప్ అలవెన్స్ గా ప్రతినెలా రూ.5 వేల రూపాయలు చెల్లిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 
 

Union Budget 2024-25

 స్వయంఉపాధి పొందే యువతకు ముద్రా రుణాలు అందిస్తామని తెలిపారు. ఈ ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయించామని... ఇందులో రూ.1.48 లక్షల కోట్లు కేవలం విద్యా, ఉపాధి, నైపుణ్యాభివృద్దికే కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 

Union Budget 2024-25

ఈ బడ్జెట్ లో యువతకు స్కిల్ డెవలప్ మెంట్... ఆ తర్వాత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందేలా తీర్చుదిద్దేందుకు నిధులు కేటాయించామన్నారు.  ఇందుకోసం రెండు లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 
 

Latest Videos

click me!