మన దేశానికి స్వాతంత్య్రం ఆషామాషీగా వచ్చింది కాదు. ఒకటీ రెండు రోజుల పోరాటంతోనూ సులభంగా రాలేదు. వేలాది మంది గొప్పవారు ఏళ్ల తరబడి చేసిన పోరాటాలు, సత్యాగ్రహాలు, త్యాగాల ఫలితంగానే భారతావనికి బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ లభించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన స్వాతంత్య్రానికి చిహ్నంగా మన దేశ వాసులు అనేక విధాలుగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రత్యేకించి స్వాతంత్య్ర దినోత్సవం రోజున చాలా మంది పతంగులను ఎగురవేస్తుంటారు. ఎందుకంటే ఈ పతంగులు మన స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి భావనను సూచిస్తాయి.
Kite Flying
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అత్యంత ప్రాచుర్యం పొందిన, సంప్రదాయాల్లో ఒకటి గాలిపటాలను ఎగురవేయడం. అవును స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పతంగులను ఎగురవేయడం ఉత్తర భారత సంప్రదాయం.
అసలు ఎప్పుడు మొదలైంది?
స్వాతంత్య్ర దినోత్సవం రోజున గాలిపటాలను ఎగురవేయడానికి కూడా చరిత్రలో ప్రాధాన్యం ఉంది. 1927లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా భారతదేశం నిరసన తెలుపుతున్నప్పుడు కొంతమంది స్వాతంత్ర్య పోరాట కార్యకర్తలు "గో బ్యాక్ సైమన్" అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన ఎంత ప్రాచుర్యం పొందిందంటే ప్రజలు వాటిపై రాసిన నినాదాలతో గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు.
Flying Kites on Independence Day
ఇంకా, స్వాతంత్య్ర దినోత్సవం రోజు గాలి పటాలను ఎగురవేయడానికి గల మరికొన్ని కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్వేచ్ఛా భావం
పతంగులను ఎగురవేయడం మన స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తిని వ్యక్తీకరించడానికి ఒక మార్గం. ఎందుకంటే గాలిపటాన్ని స్వేచ్ఛా వాయువులు ఆకాశంలోకి మరింత ఎత్తుకు తీసుకెళతాయి.
దేశభక్తిని ప్రదర్శిస్తూ..
జెండాలు లేదా చారిత్రక కట్టడాలు లాంటి దేశభక్తి చిహ్నాలతో గాలిపటాలను అలంకరించొచ్చు. మన దేశానికి మన మద్దతును చూపించడానికి, స్వాతంత్య్ర దినోత్సవాన్ని సృజనాత్మకంగా జరుపుకోవడానికి ఇదొక మార్గం. మన దేశం పట్ల మన గర్వాన్ని ఇతరులకు చూపించడానికి కూడా ఇదొక గొప్ప మార్గం.
Flying Kites on Independence Day
కుటుంబ సరదా కోసం..
బాణసంచా కాల్చడం ద్వారా శబ్ద, వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇలా కాకుండా.. గాలిపటాలను ఎగురవేస్తే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. ముఖ్యంగా దీనివల్ల కుటుంబమంతా ఒకేదగ్గర ఉంటుంది. రాబోయే సంవత్సరాలు కొనసాగే గొప్ప జ్ఞాపకాలను సృష్టించడానికి ఇదొక గొప్ప మార్గం.
అందాలను చూస్తూ..
ఆకాశంలో మన పైన ఎగురుతున్న రంగురంగుల గాలిపటం అద్భుతమైన దృశ్యం. గాలిపటం మేఘాల్లో ఎగురుతున్నప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే, చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు.