2024 లో ఇండియాలోని టాప్ 10 విద్యాసంస్థలివే ...

First Published | Aug 14, 2024, 9:30 AM IST

కేంద్ర విద్యాశాఖ భారతదేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల వివరాలను ప్రకటించింది. నేషనల్ ఇన్ట్సిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్ 2024 దేశంలోని విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఇలా 2024 ర్యాంకింగ్స్ ను ప్రకటించారు. ఇందులో టాప్ లో నిలిచిన విద్యాసంస్థలివే...

Top Educational Institutions in India

Top Educational Institutions in India : ప్రతి విద్యార్థి మంచి విద్యాసంస్థలో చదువుకోవాలని కోరుకుంటారు... తమ బిడ్డలను దేశంలోనే టాప్ యూనివర్సిటీ, టాప్ కాలేజీలో చదివించాలని తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. అయితే దేశంలో అత్యత్తమ విద్యాప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలు ఏవి? విద్యార్థుల బంగారు భవిష్యత్ పై భరోసా ఇచ్చే విద్యాసంస్థలను తెలుసుకోవడం ఎలా? ఇలా సందిగ్దంలో వున్నవారికి సమాధానమే NIRF (National Institutional Ranking Framework) ర్యాకింగ్స్.
 

Top Educational Institutions in India

కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీలు, వివిధ కోర్సులను అందిచే కాలేజీలకు ర్యాకింగ్ ఇస్తుంది. ఇందుకోసం విద్యాశాఖ పరిధిలో ఎన్ఐఆర్ఎఫ్ అనే వ్యవస్థ పనిచేస్తుంది. ఇలా తాజాగా 2024కు సంబంధించి దేశంలోని టాప్ విద్యాసంస్థల వివరాలను ప్రకటించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవల NIRF ర్యాంకింగ్స్ ప్రకటించారు. 
 

Latest Videos


IIT Madras

ఇండియాలో టాప్ 10 విద్యాసంస్థలు :

1. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (IIT Madras) 

భారత దేశంలోని అన్ని ఐఐటీల్లోనే కాదు యావత్ దేశంలోనే టాప్ విద్యాసంస్థలు ఐఐటీ మద్రాస్ నిలిచింది. ఇది తమిళనాడు రాజధాని చెన్నైలో వుంది. అత్యంత నాణ్యతతో కూడిన సాంకేతిక విద్యను అందస్తోంది ఐఐటీ మద్రాస్. 2016 లో విద్యాసంస్థలకు ర్యాకింగ్స్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఐఐటీ మద్రాస్ టాప్ లో కొనసాగుతోంది.     
 

IIS Bangalore

2. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (IIS Bangalore) 

ఇండియాలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఐఐఎస్ బెంగళూరు టాప్ 2 లో నిలిచింది.  ఈ విశ్వవిద్యాలయం కర్ణాటక రాజధాని బెంగళూరులో వుంది. ఈ యూనివర్సిటీ ఏర్పోస్పేస్,కెమికల్, సివిల్,కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు మరెన్నో కోర్సులను అందిస్తోంది. ఇలా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్,  పిహెచ్‌డి కోర్సులు అందిస్తోంది. ఈ యూనివర్సిటీలో సీటుకు మంచి డిమాండ్ వుంది. 
 

IIT Bombay

3. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే (IIT Bombay) 

దేశంలో మొట్టమొదట ఏర్పాటుచేసిన ఐఐటీల్లో ముంబయి ఒకటి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందించేందుకు దీన్ని 1958 లో స్థాపించారు. అప్పటినుండి ఇప్పటివరకు అత్యుత్తమ విద్యాప్రమాణాలతో కొనసాగుతోంది. ఐఐటీ బాంబేలో ఎన్ఐఆఎఫ్ ర్యాంకింగ్స్ 2024 లో మూడవ స్థానంలో నిలిచింది. 

IIT Delhi

4. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిల్లీ (IIT Delhi) 

1961 సంవత్సరంలో ఐఐటీ డిల్లీ స్థాపించబడింది. దేశ రాజధానిలో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అత్యుత్తమ ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తోంది. ఈ విద్యాసంస్థ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్స్ లో నాలుగో స్థానంలో నిలిచింది. 
 

IIT kanpur

5. ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT kanpur)

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో 1960 లో ఈ ఐఐటీని స్థాపించారు. ఇది ప్రతిఏడాది ప్రకటించే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్స్ లో టాప్ 10 లో చోటు దక్కించుకుంటోంది. ఈసారి కూడా అలాగే టాప్ 5 లో నిలిచింది.

IIT Kharagpur

ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్ పూర్ (IIT Kharagpur) 

భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి ఐఐటీ ఇదే. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా సమీపంలోని ఖరగ్ పూర్ లో 1951లో దీన్ని ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తోంది ఐఐటీ ఖరగ్ పూర్. ప్రస్తుతం దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఖరగ్ పూర్ ఐఐటీది ఐదో స్థానం. 
 

AIIMS Delhi, IIT Roorkee, IIT Guwahati, JNU Delhi

టాప్ 7,8,9.10 విద్యాసంస్థలు :  

ఇక దేశంలోని టాప్ 10 విద్యాసంస్థల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూడిల్లీ (AIIMS Delhi) ఏడో స్థానం, ఐఐటీ రూర్కీ (IIT Roorkee) ఎనిమిదవ స్థానం, ఐఐటీ గౌహతి (IIT Guwahati) 9వ స్థానంలో నిలిచాయి. న్యూడిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU Delhi) ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో పదవస్థానం దక్కించుకుంది. 

దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలజీ విభాగంలో కూడా ఐఐటీ మద్రాస్ మొదటిస్థానంలో నిలిచింది.  మేనేజ్ మెంట్ కేటగిరీలో అయితే  ఐఐఎమ్ అహ్మదాబాద్, బెంగళూరు, కలకత్తా టాప్ 5 లో నిలిచాయి. దేశంలోని టాప్ విశ్వవిద్యాలయంగా బెంగళూరు ఐఐఎస్సి, మెడికల్ విభాగంలో డిల్లీ ఎయిమ్స్, ఫార్మసీ విభాగంలో జామియా హమ్ దర్ద్ (డిల్లీ), కాలేజీల్లో హిందూ కాలేజ్, డెంటల్ విభాగంలొ సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఆండ్ టెక్నికల్ సైన్సెస్(చెన్నై), పరిశోధన విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు, వ్యవసాయ అనుబంధ విభాగంలో ఇండియన్ అగ్రికల్చరల్ ఇన్ట్సిట్యూట్ (డిల్లీ), న్యాయవిద్యలో బెంగళూరు నేషనల్ లా స్కూల్, ఆర్కిటెక్చర్ లో ఐఐటీ రూర్కీ టాప్ లో నిలిచాయి. 

click me!