పాతిపెట్టిన కారు విలువ కోటిన్నర రూపాయలు కావడంతో ఈ విషయం స్థానిక అధికారులకు తెలిసింది. వెంటనే వాళ్లు స్మశానానికి చేరుకున్నారు. కారును పాతిపెట్టిన కుటుంబాన్ని పిలిపించి మాట్లాడారు. ఆ విషయం నిజమా కాదా అని తెలుసుకున్నారు.
స్మశానంలో మృతదేహాలను మాత్రమే ఖననం చేయాలి. మట్టిలో సులభంగా కలిసిపోని వస్తువులను పాతిపెట్టకూడదు. చనిపోయిన వ్యక్తి బట్టలు తప్ప, పర్యావరణానికి హాని కలిగించే ఇతర వస్తువులను పూడ్చడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. కారులోని ఇనుము, ప్లాస్టిక్ భాగాలు మట్టిలో కలవడానికి ఏళ్లు పడుతుంది. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు అధికారులు ఆ కుటుంబాన్ని మందలించారు. దీంతో ఆ కుటుంబం అధికారులకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ వీడియోను షేర్ చేయవద్దని.. తాము ఇప్పటికే మనిషి పోయిన బాధలో ఉన్నామని ఆ కుటుంబం ప్రజలను కోరింది.