కుంభమేళాలో అదానీ అన్నదానం :
ప్రయాగరాజ్ కుంభమేళాకు కోట్లాదిమంది భక్తులు హాజరవుతున్నారు... పవిత్ర త్రివేణి సంగమం (గంగా, యమునా, సరస్వతి నదులు) లో స్నానం ఆచరిస్తున్నారు. ఇలా పిల్లాపాపలతో కలిసి ప్రయాగరాజ్ కు విచ్చేసిన భక్తులు ఆకలితో బాధపడకుండా వుండేలా అదానీ గ్రూప్ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతోంది.
ప్రముఖ ఆద్యాత్మిక సేవా సంస్థ ఇస్కాన్ తో కలిసి అదానీ గ్రూప్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇలా కుంభమేళాకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఆకలి తీరుస్తున్నారు. ఇలా ఒక్కరోజు కాదు... కుంభమేళా ముగిసే అన్నదానం కొనసాగనుంది. ఈ అన్నదానం కోసం మొత్తం 40 కేంద్రాలను ఏర్పాటుచేసారు.
అన్నదానం కోసం అదానీ గ్రూప్ పూర్తి సహకారం అందిస్తోందని ఇస్కాన్ డైరెక్టర్ మధుకాంత్ దాస్ తెలిపారు. ఆహారం సరఫరా చేసేందుకు అదానీ గ్రూప్ వంద వాహనాలను సమకూర్చిందని తెలిపారు. అలాగే ఈ పుణ్యకార్యంలో తమకు సహాయం చేసేందుకు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.