Thalapathy vijay: ల‌గ్జ‌రీ కార్లు, వంద‌ల కోట్ల డిపాజిట్లు.. విజ‌య్ ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Published : Mar 31, 2026, 01:20 PM IST

Thalapathy vijay: తమిళ సినీ రంగంలో అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్న దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక అడుగులు వేస్తున్నారు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 

PREV
16
రాజకీయ రంగంలో విజయ్ కీలక అడుగు

కోలీవుడ్ సూపర్ స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్, ఇప్పుడు రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపేందుకు సిద్ధమయ్యారు. తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ స్థాపించిన ఆయన, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి అడుగుపెడుతున్నారు. చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. ఈ అఫిడవిట్‌లో వెల్లడైన సంపద వివరాలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ అభిమానుల్లో కూడా ఆసక్తి రేపుతున్నాయి.

26
విజయ్ మొత్తం ఆస్తుల విలువ ఎంత?

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.603.20 కోట్లు. ఇందులో చరాస్తులు, స్థిరాస్తులు, పెట్టుబడులు అన్నీ ఉన్నాయి.

* చరాస్తులు: రూ.404.58 కోట్లు ఉండ‌గా ఇందులో రూ.213 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి.

* స్థిరాస్తులు: రూ.198.62 కోట్లు ఉన్నాయి.

* చెన్నైలో నివాస, వాణిజ్య భవనాలు, కోడైకనాల్ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉన్న‌ట్లు విజ‌య్ త‌న అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు.

అదనంగా ఆయన భార్య సంగీత పేరిట కూడా సుమారు రూ.15.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

36
లగ్జరీ కార్లు, నగలు – విజయ్ లైఫ్‌స్టైల్

సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న విజయ్ జీవనశైలి కూడా అంతే విలాసవంతంగా ఉంటుంది. ఆయన గ్యారేజీలో ఉన్న ఖరీదైన కార్లు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్ర‌స్తుతం విజయ్ వద్ద BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ కార్లు ఉన్నాయి. అలాగే అఫిడవిట్ ప్రకారం ఆయన వద్ద 883 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. చేతిలో సుమారు రూ.2 లక్షల నగదు ఉన్నట్లు కూడా వెల్లడించారు.

46
ఆదాయం, పెట్టుబడులు

సినీ రంగంలో భారీ పారితోషికం అందుకుంటున్న హీరోల్లో విజయ్ ఒకరు. అఫిడవిట్‌లో ఆయన ప్రకటించిన ఆదాయం కూడా దానికి నిదర్శనం.

2021–22 ఆర్థిక సంవత్సరం: రూ.237.46 కోట్లు

2024–25 ఆర్థిక సంవత్సరం: రూ.184.53 కోట్లు

ఇక ఆయన సంపాదనలో భాగంగా పలు కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు వివరించారు. సినీ కెరీర్‌తో పాటు వ్యాపార పెట్టుబడుల ద్వారా కూడా ఆయన ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.

56
అప్పులు లేవు.. కానీ

విజయ్ అఫిడవిట్‌లో ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయనకు ఎలాంటి బ్యాంక్ అప్పులు లేవని స్పష్టం చేశారు. అయితే తన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రం భారీగా డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు వెల్లడించారు. భార్య సంగీతకు – రూ.12.60 కోట్లు, తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు – రూ.3.02 కోట్లు, టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్‌కు – రూ.3 కోట్లు అప్పులు ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఇవే కాకుండా పలు విద్యా సంస్థలు, ట్రస్టులకు సుమారు రూ.45 కోట్లకు పైగా అడ్వాన్సులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

66
ఎన్నిక‌ల‌కు కౌంట్‌డౌన్

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ తమిళ వెట్రి కళగం (TVK) తరఫున బరిలో దిగుతున్నారు. పెరంబూర్‌తో పాటు తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఈ ఫలితాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. సినీ రంగంలో అగ్ర హీరోగా నిలిచిన విజయ్, రాజకీయాల్లో కూడా అదే స్థాయి ప్రభావం చూపగలరా అన్నది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories