భార్య వేధింపులు.. రాజ్‌భవన్‌ దగ్గర టెకీ సూసైడ్ అటెంప్ట్..

Published : Apr 14, 2025, 07:40 PM IST

Techie Suicide Attempt Wife's Harassment: కుటుంబ గొడవలతో విసిగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని రాజ్‌భవన్ దగ్గర సూసైడ్ చేసుకునేందుకు  ప్రయత్నించాడు. హెబ్బాళ్‌లో ఉండే జుహైల్ అహ్మద్ (26) సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేసిన వ్యక్తిగా గుర్తించారు. 

PREV
భార్య వేధింపులు..  రాజ్‌భవన్‌ దగ్గర టెకీ సూసైడ్ అటెంప్ట్..

Techie Suicide Attempt Wife's Harassment: బెంగళూరు లో కుటుంబ గొడవలతో విసిగిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని రాజ్‌భవన్ దగ్గర సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేశాడు. హెబ్బాళ్‌లో ఉండే జుహైల్ అహ్మద్ (26) సూసైడ్ చేసుకునేందుకు ట్రై చేసిన వ్యక్తిగా గుర్తించారు.

ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడున్న జర్నలిస్టులు వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. దీని వల్ల కాసేపు రాజ్‌భవన్ దగ్గర హైడ్రామా నడిచింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జుహైల్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను 6 నెలల కిందటే చిక్కబళ్లాపూర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందట జుహైల్‌పై అతని భార్య చిక్కబళ్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కేసు పెట్టింది. అందుకే పోలీసులు జుహైల్‌ను పిలిచి విచారణ చేసి వార్నింగ్ ఇచ్చి పంపించారు. 

దీని వల్ల బాధపడిన జుహైల్ ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వచ్చి బ్యాగులో తెచ్చుకున్న బాటిల్ తీసి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అదే టైమ్‌కు అక్కడున్న జర్నలిస్టులు జుహైల్‌ను పట్టుకుని పెట్రోల్ బాటిల్ లాక్కొని ప్రమాదం తప్పించారు. తాను ఇలా చేయడానికి భార్య వేధింపులు, బెదిరింపుల కారణమని అతను ఆరోపణలు చేశాడు.

 "నా భార్య వల్ల నాకు బెదిరింపులు ఉన్నాయి, ఆమె నన్ను వేధిస్తోంది. నా మీద అబద్ధపు కేసు పెట్టింది. చిక్కబళ్లాపూర్ పోలీసులు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు" అని జుహైల్ ఆరోపించాడు. తనకు న్యాయం కావాలని అంటున్నాడు. జుహైల్ దగ్గర డెత్ నోట్ మాదిరిగా చాలా పేపర్లు దొరికాయి. అందులో తన భార్య వేధింపుల గురించి రాసుకున్నాడు.

"నా జీవితం ప్రమాదంలో ఉంది. ఈ జీవితాన్ని ఇక్కడితో ముగించేస్తున్నాను. సారీ మమ్మీ-డాడీ" అని రాసి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు జుహైల్‌ను అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories