Supreme Court: 9వ తరగతి నుంచి మూడో భాష బోధించడంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలకు ముందు కొత్త భాష ప్రవేశపెట్టడం విద్యార్థులపై ఒత్తిడి పెంచడమేనని స్పష్టం చేసింది. అలాగే NEPలో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
9 వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే టైంలో కొత్త భాష ఇవ్వడం సరైన విధానం కాదని జస్టిస్ బీవీ నాగరత్న వ్యాఖ్యానించారు. మూడో భాషను 9 తరగతిలో కాకుండా 6వ తరగతి లేదా 8 వ తరగతి నుంచి పెడితే విద్యార్థులకు ఈజీ అవుతుందని సుప్రీంకోర్టు సూచించారు.
25
మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై తమిళనాడు ప్రభుత్వం పిటిషన్
తమిళనాడులో ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణలో జాతీయవిద్యా విధానం, త్రిభాషా సూత్రం, విద్యార్థులపై విద్యాభారం వంటి అంశాలపై ధర్మాసనం స్పందించింది.
35
తమిళనాడు ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యర్థనను తోసి పుచ్చిన సుప్రీంకోర్టు
తమిళనాడు ప్రభుత్వ తరపు న్యాయవాది..CBSCలో 9 వ తరగతి నుంచే మూడో భాష తప్పనిసరి అవుతుందని చెప్పగా...జస్టిస్ నాగరత్న ఆ వాదనను తోసిపుచ్చారు. 9 తరగతి నుంచి బోర్డు పరీక్షల ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు కొత్త భాషను ప్రారంభించడం కంటే 6 తరగతి నుంచే చేర్చితే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. తన సూచనను CBSC, ICSE, రాష్ట్ బోర్డులు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. 8 వ తరగతి నుంచే 10 వ తరగతి బోర్డ్ ఏగ్జామ్స్ ప్రెజర్ ఉంటుందని...ఆ సమయంలో కొత్త భాషను విద్యార్థులపై రుద్దొద్దని చెప్పారు.
ఇదే విచారణలో జాతీయ విద్యావిధానంపైనా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. NEPలో మూడో భాషగా హిందీని ఎవరూ తప్పనిసరి చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర భాష, ఇంగ్లీష్‍తో ఏదైనా మరో భారతీయ భాషను మూడో భాషగా ఎంచుకోవచ్చని, హిందీనే చదవాలనే నిబంధన ఎక్కడా లేదని వివరించారు. ప్రతివాది తరపు న్యాయవాది కూడా NEPలో ఏ రాష్ట్రంపైనా ఏ భాషను బలవంతంగా రుద్దకూడదని స్పష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు...మీకు హిందీ వద్దనుకుంటే..సంస్కృతం అయితే అభ్యంతరం ఏమిటని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
55
కేంద్రం చెప్పిందని వ్యతిరేకించకండి: సుప్రీంకోర్టు
అదే సమయంలో కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానాన్ని కేవలం కేంద్రం ప్రతిపాదించిందనే కారణంతో వ్యతిరేకించవద్దని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్రానికి సొంత విద్యా విధానం ఉండొచ్చని, కానీ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించడం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని కోర్టు చెప్పింది. ఆ చర్చలు విఫలమైతే కేసు మెరిట్స్ పై విచారణ చేపడతామని తెలిపింది. తర్వాతి విచారణ ఆగష్టు 11కు వాయిదా వేసింది.