రైతులు అడవిపందులను చంపొచ్చు.. కేరళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

First Published Jul 23, 2021, 2:39 PM IST

ఈ మేరకు కేరళ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ రైతుల వ్యవసాయ భూముల్లోకి వచ్చే అడవి పందులను వేటాడేందుకు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 11 (1) (బి) ప్రకారం  అనుమతించాలని ఆదేశించింది. దీని నివేదికను ఒక నెలలోపు కోర్టుకు సమర్పించాలని తెలిపింది.

వయనాడ్ జిల్లాలోని రైతులు తమ పంటలపై దాడి చేస్తున్న అడవి పందులను చంపడానికి కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రైతులకు తీవ్ర ఉపశమనం లభించినట్లైంది.
undefined
ఈ మేరకు కేరళ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ రైతుల వ్యవసాయ భూముల్లోకి వచ్చే అడవి పందులను వేటాడేందుకు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 11 (1) (బి) ప్రకారం అనుమతించాలని ఆదేశించింది. దీని నివేదికను ఒక నెలలోపు కోర్టుకు సమర్పించాలని తెలిపింది.
undefined
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ జస్టిస్ పిబి సురేష్ కుమార్ పంటల మీద అడవి పందుల దాడులను నియంత్రించడంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చాలా అవసరమని వ్యాఖ్యానించారు. అందుకే అడవి పందులను వేటాడేందుకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ రైతులకు అనుమతివ్వాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయడం సముచితమని కోర్టు అభిప్రాయపడింది.
undefined
"అడవి పందుల దాడిని నియంత్రించే సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అంగీకరించినందున, ఈ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం సముచితమని భావిస్తుంది, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పిటిషనర్లను అడవి పందులను వేటాడేందుకు అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు ఒక నెలలోపు నివేదిక సమర్పించాలి."అని ఉత్తర్వులో పేర్కొంది.
undefined
బాదిత రైతులు వేసిన రిట్ పిటిషన్ పై వాదిస్తున్న న్యాయవాదులు అలెక్స్ ఎం స్కారియా, అమల్ దర్శన్ ల వాదనల ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేయబడింది.
undefined
వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 62 ప్రకారం అడవి పందులను క్రిమికీటకాలుగా ప్రకటించాలని కోరుతూ ఆరుగురు రైతుల బృందం నిరుడు కోర్టును ఆశ్రయించింది. తమ వ్యవసాయ పంటలపై అడవి పందుల దాడుల వల్ల అవి తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపిస్తూ రిట్ పిటిషన్‌ లో పేర్కొన్నారు.
undefined
'అడవి పంది' వన్యప్రాణి రక్షణ చట్టంలోని షెడ్యూల్ II కింద చేర్చబడింది. దీని ప్రకారం వ్యవసాయ భూములు లేదా ఆస్తుల రక్షణ కోసం కూడా అడవి పందిపై దాడి చేయడం లేదా చంపడం నేరం. దీనికి గాను క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ ఎదుర్కోవలసి ఉంటుంది.
undefined
దీంతో తమ పంటను కళ్లముందే నాశనం చేస్తున్నా వ్యవసాయదారులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. అడవి పందుల నుండి వారి పంటలను శిక్షలు పడకుండా రక్షించడానికి వేరే మార్గాలు లేవు. కోజికోడ్ జిల్లా తూర్పు ప్రాంతాలకు చెందిన రైతులు అడవి పందులతో తరచుగా నష్టపోతున్నారు.దీంతో వీరు న్యాయవాది అమల్ దర్శన్ ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
undefined
అంతేకాదుసెక్షన్ 62 ప్రకారం, ఎలుకలు, చుంచులు, కాకులు, పండ్ల గబ్బిలాలు వంటి కొన్ని అడవి జంతువులను "క్రిమికీటకాలు" గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. దీని ప్రకారం, ఈ విజ్ఞప్తిపై కోర్టు రాష్ట్ర ప్రభుత్వ స్పందనను కోరింది.
undefined
click me!