కొడుకు పెళ్లిలో నీతా అంబానీ చేతికి స్పెషల్ మెహంది... వేసిందెవరు, ఎంత తీసుకున్నారో తెలుసా..?

First Published | Jul 20, 2024, 8:47 PM IST

అంగరంగ వైభవంగా జరిగిన అనంత్,రాధిక పెళ్లిలో అంబానీ ఇంటి ఆడపడుచులు అందంగా ముస్తాబయ్యారు. వారి చేతులకు ఎర్రగా మెరిసిపోయిన మెహందీ మరింత అందాన్ని అద్దింది. అయితే ఈ మెహందీ ఎవరు వేసారు... ఎంత ఖర్చయ్యిందో తెలుసా..?

Anant Ambani Radhika Merchant Wedding

Anant Ambani Radhika Merchant Wedding : భారత దేశంలోనే అత్యంత ఖరీదైన శుభకార్యం ఏదంటే టక్కున అంబానీల ఇంట జరిగిన పెళ్లిగురించి చెబుతారంతా. ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి  దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో  చర్చకు దారితీసింది. ఈ పెళ్లికి అంబానీ కుటుంబం ఐదువేల కోట్లు ఖర్చుచేసిందట... కాబట్టి ఈమాత్రం చర్చ జరక్కుండా వుంటుందా..! 
 

Anant Ambani Radhika Merchant Wedding

అయితే ఈ పెళ్ళిలో అంబానీ కుటుంబసభ్యులు ధరించిన వస్త్రాభరణాల గురించి ప్రత్యేక చర్చ సాగుతోంది. కేవలం వధూవరులు అనంత్, రాధిక మాత్రమే కాదు మిగతా కుటుంబసభ్యులంతా కోట్లాది రూపాయల విలువచేసే డిజైనర్ దుస్తులు, వజ్రాభరణాలతో మెరిసిపోయారు. చివరకు వధువు రాధికతో పాటు అంబానీ ఇంటి ఆడపడుచులు మెహందీకే కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం. 
 


Anant Ambani Radhika Merchant Wedding

ముఖ్యంగా కొడుకు పెళ్లిలో నీతా అంబానీ చేతికి ఎర్రగా మెరిసిపోతున్న మెహంది అతిథులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆ మెహందీ డిజైన్ ప్రత్యేకతను స్వయంగా నీతానే వివరించారు. నవ వధూవరులు అనంత్, రాధికతో పాటు పెద్దకొడుకు,కోడలు ఆకాష్, శ్లోకా... కూతురు, అల్లుడు, భర్త, మనవడు మనవరాళ్ల పేర్లను తన చేతిపై రాయించుకున్నారు నీతా. అలాగే రాధాకృష్ణుల చిత్రాలతో కూడిన మెహందీ డిజైన్ అందరిని ఆకట్టుకుంది. 
 

Anant Ambani Radhika Merchant Wedding

ఇక పెళ్లికూతురు రాధిక చేతికి కూడా సరికొత్త డిజైన్లతో మెహందీ కనిపించింది. అంబానీ ఇంటి ఆడపడుచు ఈషా, పెద్దకోడలు శ్లోకా చేతికి కూడా మెహందీ డిజైన్లు ఆకట్టుకున్నాయి. ఇలా అంబానీ కుటుంబసభ్యుల చేతికి మెహందీ అందరినీ ఆకట్టుకుంది. 
 

Anant Ambani Radhika Merchant Wedding

అంబానీ ఇంట పెళ్లిలో మెహందీ వేసిందెవరో తెలుసా..? 

అపర కుబేరుల ఇంట పెళ్లంటే అంత ఆషామాషీగా వుండదుగా... ఏం చేయాలన్నా ఆ పనిలో మంచి ప్రతిభ కలిగినవారినే ఎంపికచేసుకుంటున్నారు. మరీముఖ్యంగా ఆడపడుచులు డ్రెస్సింగ్, మేకప్, మెహందీ వంటి విషయాల్లో అస్సలు తగ్గరు. ఇలా అంబానీ ఇంటి ఆడాళ్లు కూడా సెలబ్రిటీ మెహందీ డిజైనర్ ను ఎంపిక చేసుకున్నారు. 
 

Anant Ambani Radhika Merchant Wedding

వీణ నగాడా... గుజరాత్ కు చెందిన ప్రముఖ మెహందీ డిజైనర్. ఈమె దీపికా పదుకోన్, ఆలియా భట్, కత్రినా కైఫ్, కియారా,సోనమ్ కపూర్ వంటివారికి ఇష్టమైన మెహందీ ఆర్టిస్ట్. పలు బాలీవుడ్ సినిమాలకు కూడా ఈమె పనిచేసారు. చాలా సింపుల్ గా ఆకట్టుకునే డిజైన్లతో మెహందీ వేయడంలో వీణ నిష్ణార్థురాలు. అందువల్లే ముంబైలో బాలీవుడ్ నటీనటులు, వ్యాపారవేత్తల ఇళ్లలో పెళ్లిగానీ, ఇతర శుభకార్యాలు గానీ జరిగాయంటే తప్పకుండా వీణకు పిలుపువస్తుంది. 

Anant Ambani Radhika Merchant Wedding

ఇలా మెహందీ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన వీణ నీతా అంబానీ దృష్టిలో పడ్డారు. ఇంకేముంది తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి వీణను మెహందీ ఆర్టిస్ట్ గా ఎంపికచేసారు. నీతా అంబానీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రతిభనంతా రంగరించి అద్భుతమైన మెహందీ డిజైన్లతో ఆకట్టుకున్నారు. అంబానీ ఇంటి ఆడపడుచుల చేతి మెహందీకి ప్రతిఒక్కరూ ఫిదా అయ్యారు. 

Anant Ambani Radhika Merchant Wedding

మెహందీకి ఎంత ఖర్చయ్యింది..: 

అసలే సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్... అందులోనూ అంబానీల ఇంట జరుగుతున్న అత్యంత ఖరీదైన పెళ్ళి. కాబట్టి మెహందీ కోసం కూడా కోట్లు ఖర్చుచేసి వుంటారనే టాక్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మెహందీ ఆర్టిస్ట్ వీణ అంబానీల నుండి కోట్లలో డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నీతా అంబానీ మెహందీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీణ నగాడా పేరు మారుమోగిపోతోంది. 

Latest Videos

click me!