సౌత్ వెస్ట్రన్ రైల్వే నోటిఫికేషన్ ప్రకారం, ఈ గ్రూప్ బుకింగ్ సదుపాయం మెయిన్ స్టేషన్లలో మాత్రమే ఉంటుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ కింద రిజర్వేషన్లు మొదలైన గంట తర్వాత, అంటే ఉదయం 9 గంటల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. జర్నీ డేట్‌కు 60 రోజుల ముందు ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ మొదలవుతుంది.
ఉదాహరణకు, ఈ రోజు నుంచి 100 రోజుల తర్వాత ప్రయాణం చేయాలంటే అప్పుడే టికెట్ బుక్ చేయలేరు. ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు ఉదయం 8 గంటల నుంచే బుకింగ్ మొదలవుతుంది. పెళ్లిళ్లు, స్టడీ టూర్లు, తీర్థయాత్రలు, స్పోర్ట్స్ టీమ్స్ లేదా కల్చరల్ గ్రూప్స్ వంటి నిజమైన అవసరాల కోసం వెళ్లేవారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని సౌత్ వెస్ట్రన్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కన్ఫర్మ్, ఆర్ఏసీ, వెయిట్‌లిస్టెడ్ టికెట్లతో సంబంధం లేకుండా అన్ని క్లాసులకు ఇది వర్తిస్తుంది.