సిద్ధి బస్సు ప్రమాదం.. నవ దంపతుల మృతి.. ఒకే చితిపై దహనం

First Published Feb 20, 2021, 12:30 PM IST

వారు ప్రయాణిస్తున్న బస్సు కెనాల్ లో పడిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. వారిలో వీరిద్దరు కూడా ఉన్నారు.

ఎన్నో ఆశలతో ఆ దంపతులు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వారికి పెళ్లి జరిగి కనీసం సంవత్సరం కూడా నిండలేదు. అప్పటికి వారికి పెళ్లయ్యి కేవలం ఎనిమిది నెలలే అవుతోంది. అంతలోనే వారి జీవితాలు రోడ్డు ప్రమాదానికి బలయ్యాయి.
undefined
ఇటీవల మధ్యప్రదేశ్ లోని సిద్ధిలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై దాదాపు 52మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారిలో ఓ జంట కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా.. వారి దహనసంస్కారాలు కూడా ఒకే చితిపై నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
సిద్ధి జిల్లాకు చెందిన అజయ్ పనికా(25) కి ఎనిమిది నెలల క్రితం తపస్య(23) తో వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పరిక్ష కోసం ప్రిపేర్ అవుతుతున్నారు. దీనిలో భాగంగానే.. వీరిద్దరూ పరీక్ష కోసం సిద్ధి బస్సు ఎక్కి వెళ్లారు.
undefined
కాగా.. వారు ప్రయాణిస్తున్న బస్సు కెనాల్ లో పడిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. వారిలో వీరిద్దరు కూడా ఉన్నారు. కాగా.. మంగళవారం సాయంత్రం వీరిద్దరి మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. ఒకరి తర్వాత మరొకరికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు.
undefined
ఇద్దరి మృతదేహాలు స్వగ్రామానికి చేరుకోగా.. ఒకే చితిపై వీరి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
undefined
కాగా.. వీరి అంతిమ సంస్కారాలకు అజయ్ తండ్రి రాకపోవడం గమనార్హం. కాగా వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు నమోదు చేసుకున్నాయి.
undefined
వీరికి ఎనిమిది నెలల క్రితమే వివాహమైందని.. తన భార్య బాగా చదివి మంచి ఉద్యోగం సాధించాలని అజయ్ ఎప్పుడూ కోరుకునేవాడని అందుకోసం ఆమెను ప్రోత్సహించేవాడంటూ గ్రామస్థులు పేర్కొన్నారు.
undefined
click me!