బహిరంగ సభలో కుప్పకూలిన ముఖ్యమంత్రి.. ఆరోగ్యంపై మోదీ ఆరా..

First Published Feb 15, 2021, 9:33 AM IST

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తూ వేదికపై హాఠాత్తుగా కుప్పకూలిపోయారు. అనుకోని ఈ పరిణామానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గుజరాత్ లోని వడోదర లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో హఠాత్తుగా అస్వస్థతకు లోనైన రూపానీ స్టేజ్ పైనే పడిపోయారు. 

undefined
వెంటనే అలర్ట్ అయిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది రూపనీకి ప్రథమ చికిత్స అందించి, అహ్మాదాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో రూపానీ వెళ్లాల్సిన ఇతర బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. వడోదరలోని నిజాంపురలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీశారు
undefined
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానిక బీజేపీ నాయకులు వెల్లడించారు. వడోదరలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా సీఎంకు కళ్లు తిరిగాయనీ దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పడిపోకుండా పట్టుకున్నారని బీజేపీ నేత భరత్ తెలిపారు. ఆ తరువాత రూపానీని వడోదర నుంచి అహ్మదాబాద్‌కు హెలికాప్టర్‌లో తరలించామని తెలిపారు.

కొద్ది రోజులుగా రూపానీ విశ్రాంతి లేకుండా వరుస ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంతో రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం దెబ్బతిందన్నారు. లోబీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరసపడ్డారని వైద్యులు తెలిపారని చెప్పారు.
undefined
కాగా గుజరాత్ లోని వడోదరతో సహా కీలకమైన ఆరు మునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి.
undefined
click me!