వర్షాల తీవ్రత తగ్గకపోవడంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సోమవారం సెలవు ప్రకటించారు. కాసర్‌గోడ్, కణ్ణూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్, త్రిసూర్, ఎర్నాకుళం, ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట, అలప్పుళ జిల్లాల్లోని స్కూళ్లు, ప్రొఫెషనల్ కాలేజీలతో సహా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి.
అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు కూడా మూసివేయాలని ఆదేశించారు. అయితే ముందస్తుగా నిర్ణయించిన యూనివర్సిటీ పరీక్షలు, పబ్లిక్ ఎగ్జామ్స్ యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. కోజికోడ్‌లో విద్యాసంస్థలు భౌతికంగా మూసివేసినా, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. అలప్పుళలో సహాయక శిబిరాలుగా పనిచేస్తున్న పాఠశాలలకు మాత్రమే ప్రాంతీయంగా సెలవు ఇచ్చారు.