Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు సూపర్ గుడ్ న్యూస్

Published : Nov 15, 2026, 09:01 AM IST

Sabarimala Ayyappa Swamy Prasadam: శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త..! ఇండియా పోస్ట్, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సంయుక్తంగా అరవణ పాయసం, అప్పం ప్రసాదాలను నేరుగా ఇంటికే పంపించే సేవను తెచ్చాయి. ఆ వివరాలు మీకోసం.

PREV
15
శబరిమల అయ్యప్ప సన్నిధానం నుంచే మీ ఇంటి గడపకు అరవణ పాయసం, అప్పం

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే కోట్లాది మంది భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB), ఇండియా పోస్ట్ కలిసి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాయి. సాధారణంగా శబరిమల యాత్రకు వెళ్లినప్పుడు భక్తులకు ఎదురయ్యే పెద్ద టాస్క్ ఏంటంటే.. దర్శనం అయ్యాక అరవణ పాయసం, అప్పం ప్రసాదాలను క్యూలో నిలబడి కొనుక్కోవడం, వాటిని తిరుగు ప్రయాణంలో జాగ్రత్తగా ఇంటికి మోసుకురావడం.

రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో లగేజీతో పాటు ప్రసాదాల డబ్బాలను క్యారీ చేయడం భక్తులకు కాస్త కష్టంగా ఉండేది. అయితే, ఇకపై ఆ టెన్షన్ అస్సలు అవసరం లేదు. సన్నిధానం నుంచే నేరుగా మీ ఇంటి గడపకు ప్రసాదం వచ్చేలా కొత్త సదుపాయం అందుబాటులోకి రాబోతోంది.

25
సన్నిధానంలో 24 గంటల ప్రత్యేక కౌంటర్

2026-27 వార్షిక మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ కోసం శబరిమల ఆలయ తలుపులు నవంబర్ 16న తెరుచుకోనుండగా, నవంబర్ 17 నుంచి 41 రోజుల పాటు జరిగే ఈ మహా యాత్ర అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, ఇండియా పోస్ట్ మధ్య ఒక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ప్రకారం, కొండపై ప్రధాన ఆలయ ప్రాంగణంలోని దేవస్వం బోర్డు అరవణ, అప్పం కౌంటర్ల పక్కనే ఇండియా పోస్ట్ ఒక ప్రత్యేక స్వామి ప్రసాదం పార్శిల్ బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కౌంటర్ రోజులో 24 గంటలూ భక్తులకు అందుబాటులో ఉంటుంది.

35
మీరు ఇంటికి చేరేలోపే ప్రసాదం రెడీ

ఈ కొత్త విధానం వల్ల భక్తులకు ప్రయాణ భారం పూర్తిగా తగ్గుతుంది. దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు సన్నిధానంలోనే ఆన్‌లైన్‌లో లేదా ప్రత్యేక కౌంటర్ వద్ద తమ ఇంటి చిరునామా ఇచ్చి ఎన్ని ప్రసాదం ప్యాకెట్లనైనా బుక్ చేసుకోవచ్చు. తపాలా శాఖకు చెందిన స్పీడ్ పోస్ట్ పార్శిల్ సర్వీస్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ మూలకైనా ఈ ప్రసాదాలను సురక్షితంగా డెలివరీ చేస్తారు.

విశేషమేమిటంటే, భక్తులు తమ యాత్ర ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునే సమయానికే వారి ప్రసాదం పార్శిళ్లు ఇంటికి డెలివరీ అవుతాయి. దీనివల్ల తిరుగు ప్రయాణంలో ప్రసాదం ప్యాకెట్లు పాడైపోతాయన్న భయం గానీ, మోసుకెళ్లే ఇబ్బంది గానీ ఉండదు.

45
దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా బుకింగ్ అవకాశం

ఈ సదుపాయం కేవలం శబరిమల కొండపై మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల ద్వారా కూడా అందుబాటులో ఉండనుంది. అంటే, శబరిమలకు వెళ్లలేని భక్తులు కూడా భారత్‌లోని ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా స్వామి ప్రసాదాన్ని బుక్ చేసుకుని తమ ఇళ్లకు లేదా తమ బంధుమిత్రుల చిరునామాలకు పంపించుకునే వెసులుబాటు కల్పించారు. భారీ రద్దీ ఉండే యాత్రా సమయంలో ప్రసాదాల కొనుగోలు, రవాణా కష్టాలను పూర్తిగా నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

55
శబరిమల ఆలయ అధికారుల కీలక ప్రకటన

వచ్చే వారం నుంచి మండల పూజల కోసం ఆలయం తెరుచుకునే సమయానికి ఈ ప్రత్యేక పార్శిల్ బుకింగ్ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్, కేరళ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అమితాబ్ సింగ్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

చాలా సులభమైన బుకింగ్ ప్రక్రియ, సురక్షితమైన ప్యాకేజింగ్, నమ్మకమైన స్పీడ్ పోస్ట్ డెలివరీతో ఈ సేవ అయ్యప్ప భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఏటా భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం తీసుకున్న ఈ స్మార్ట్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories