గుర్రపుబగ్గీలో రిపబ్లిక్ డే వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకల గుర్రపుబగ్గీలో విచ్చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరారు. రాష్ట్రపతితో పాటు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో కూడా ఉన్నారు. రాష్ట్రపతి అంగరక్షకులు గుర్రాలపై స్వారీ చేస్తూ గౌరవవందనంతో ముందుకుసాగారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఇక్కడకు వచ్చారు. రాష్ట్రపతికి ఆయన స్వాగతం పలికారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను నరేంద్ర మోడీ కౌగిలించుకుని గౌరవంగా స్వాగతం పలికారు.
గణతంత్ర దినోత్సవం 2025 వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు?
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా రిపబ్లిక్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ప్రత్యేక అతిథి. సుబియాంటో పర్యటన 1950లో భారతదేశ ప్రారంభ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో అడుగుజాడల్లో భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే నాల్గవ ఇండోనేషియా అధ్యక్షుడు కానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగిస్తారు.
“మా గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మీరు భారతదేశాన్ని సందర్శించడం మాకు ఎంతో గర్వకారణం. ఈవెంట్‌లో మొదటిసారిగా ఇండోనేషియా మార్చింగ్ స్క్వాడ్‌ను చూసేందుకు మేమంతా ఆసక్తిగా ఉన్నాము. మరోసారి, నేను మీకు, మీ ప్రతినిధి బృందానికి భారతదేశానికి స్వాగతం పలుకుతున్నాను” అని ప్రధాని మోడీ అంతుకుముందు వారికి స్వాగతం పలికారు.