విదేశాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శన
తోలుబొమ్మలాట గ్రామీణ కళ అయినప్పటికీ విదేశాల్లో కూడా ఈ కళ ప్రదర్శించారామె. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇరాన్, ఇరాక్, స్విట్జర్లాండ్, హాలెండ్ వంటి దేశాల్లో రామాయణ, మహాభారతం వంటి కావ్యాలను, ప్రస్తుత సంఘటనలను భీమవ్వ శిళ్ళేక్యతర్ తోలుబొమ్మలాట ద్వారా ప్రదర్శించి.. నాటి కళ, సంస్కృతి, వారసత్వాన్ని తెలియజేయడంలో విజయం సాధించారు.
భీమవ్వ శిళ్ళేక్యతర్‌కు పురస్కారాల వర్షం
భీమవ్వ శిళ్ళేక్యతర్ సాధనను చూసి ప్రభుత్వం అనేక పురస్కారాలతో సత్కరించింది. 1993లో టెహ్రాన్ దేశ బొమ్మల ఉత్సవ పురస్కారం, 63వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళన పురస్కారం, ప్రాంతీయ రంగ కళల అధ్యయన పురస్కారం, 2005-06 సంవత్సరంలో జానపద, బయలాట అకాడమీ పురస్కారం, 2010లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో రాజ్యోత్సవ పురస్కారం, 2020-21 సంవత్సరంలో జానపద శ్రీ పురస్కారం, 2022లో వృద్ధుల పురస్కారం ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి అనేక పురస్కారాలు లభించాయి.