ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి కనీసం రెండు రకాల వెరిఫికేషన్స్ అవసరం. కేవలం మెసేజ్‌లో వచ్చిన OTP ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయడం కుదరదు. ప్రతి లావాదేవీకి ఈ మూడు పద్ధతుల్లో ఏవైనా రెండింటిని ఉపయోగించాలి.
1. పిన్, పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ పాస్‌ఫ్రేజ్.
2. OTP లేదా హార్డ్‌వేర్ టోకెన్.
3. వేలిముద్ర, ఫేస్ స్కాన్ లేదా ఐరిస్ స్కాన్.
ఈ నిబంధనలు దేశీయ లావాదేవీలకే కాకుండా అంతర్జాతీయ లావాదేవీలకు కూడా వర్తిస్తాయి. అయితే అంతర్జాతీయ కార్డు లావాదేవీలకు పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అక్టోబర్ 2026 వరకు గడువు ఇచ్చారు. ఆన్‌లైన్ మోసాలను తగ్గించడం, డిజిటల్ లావాదేవీలపై ప్రజల నమ్మకాన్ని పెంచడమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం.