మీ దగ్గర ఈ 2 రూపాయల నోటు ఉందా..? అయితే లక్షలాది డబ్బు సొంతం అవుతుందట..!

Published : Jan 14, 2026, 07:53 PM IST

Old 2 Rupees Note :  మీ దగ్గర ప్రత్యేకమైన 2 రూపాయల కరెన్సీ నోటు ఉంటే లక్షలు సంపాదించవచ్చనే ఓ ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ఓల్డ్ కరెన్సీ నోటు ఎలా ఉండాలంట తెలుసా? 

PREV
14
మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా..?

పాత నాణేలు, నోట్లను సేకరించే అలవాటు ఇప్పుడు చాలా మందికి పెద్ద లాభదాయక వ్యాపారంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పాత 2 రూపాయల నోట్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మీ దగ్గర ప్రత్యేక లక్షణాలున్న 2 రూపాయల నోటు ఉంటే దాన్ని 4 లక్షల రూపాయల వరకు అమ్మవచ్చనే వార్త సోషల్ మీడియాలో సాగుతోంది. ఇలాంటి నోట్లు ఎలా అమ్ముకోవాలో కూడా వివరిస్తున్నారు.

24
2 రూపాయల నోటుకు రూ.4 లక్షలా..!

అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముడవ్వాలంటే 2 రూపాయల నోటులో కొన్ని ముఖ్యమైన ప్రత్యేకతలు ఉండాలి.

• 786 నంబర్: నోటు ముందు భాగంలో సీరియల్ నంబర్‌లో '786' అని ఉండాలి. (ఈ సంఖ్యను చాలామంది అదృష్టంగా, పవిత్రంగా భావిస్తారు).

• రంగు: ఆ నోటు గులాబీ (పింక్) రంగులో ఉండాలి.

మీ దగ్గర ఇలాంటి నోటు ఒకటి ఉంటే రూ.4 లక్షలు, అదే మూడు నోట్లు ఉంటే రూ.12 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని చెబుతున్నారు.

మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు, ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో అమ్మవచ్చని కూడా సలహా ఇస్తున్నారు.

34
డబ్బులతో డబ్బులు సంపాదించండి

1. Quikr లాంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో 'విక్రేత' (Seller)గా నమోదు చేసుకోవాలి.

2. మీ దగ్గర ఉన్న నోటు స్పష్టమైన ఫోటోను అప్‌లోడ్ చేయాలి.

3. ఆ నోటును కొనడానికి ఇష్టపడే కస్టమర్లు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు. ఆ తర్వాత ధర మాట్లాడుకుని మీరు అమ్ముకోవచ్చు.

44
ఈ జాగ్రత్తలు పాటించండి

సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నా, కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి.

• ఆర్‌బిఐ (RBI) వివరణ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి పాత నోట్లు, నాణేలను అమ్మడానికి లేదా కొనడానికి ఏ వ్యక్తికి లేదా సంస్థకు అనుమతి ఇవ్వలేదు.

• మోసాల పట్ల జాగ్రత్త: నోటు కొంటామని చెప్పి ఎవరైనా మీ దగ్గర అడ్వాన్స్ అడిగినా లేదా వ్యక్తిగత బ్యాంకు వివరాలు అడిగినా ఇవ్వొద్దు. ఆన్‌లైన్ మోసగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

ముఖ్య గమనిక: 

ఇలాంటి అరుదైన నోట్లను అమ్మే ముందు లీగల్ అంశాలను నిర్ధారించుకోవడం మంచిది. అలాగే మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించండి.

Read more Photos on
click me!

Recommended Stories