Petrol Price : హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి పెద్ద నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.95 నుంచి రూ.107 మధ్య ఉంది. కానీ ఒక రాష్ట్రంలో మాత్రం ప్రజలు లీటర్ పెట్రోల్‌ను 200 రూపాయలకు కొనాల్సి వస్తోంది. ఆ రాష్ట్రమేదో తెలుసా?
రూ.100-110కి దొరికే పెట్రోల్ రూ.200 అయితే ఎలా ఉంటుంది? మణిపూర్‌లో ఇదే జరుగుతోంది. అక్కడ లీటర్ పెట్రోల్‌ను 200 రూపాయలకు అమ్ముతున్నారు. దీనికోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడడమో లేదా బ్లాక్‌లో కొనడమో చేస్తున్నారు.
25
పెట్రోల్ పంపులో బంద్...
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో ఒక పెట్రోల్ పంపుపై బాంబు పేలుడు జరిగింది. దీని తర్వాత మణిపూర్ పెట్రోలియం డీలర్స్ ఫ్రాటర్నిటీ (MPDF) లోయ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోల్ పంపులను నిరవధికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
35
పెట్రోల్ డీలర్ల నిరవధిక సమ్మె
మణిపూర్ పెట్రోలియం డీలర్స్ ఫ్రాటర్నిటీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ దొరక్క అవసరమైన పనులకు కూడా వెళ్లలేకపోతున్నారు. కొందరు పంపుల వాళ్లు దీన్ని అవకాశంగా తీసుకుని ఇష్టమొచ్చిన ధరకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు.
మణిపూర్‌లో ప్రజలు లీటర్ పెట్రోల్‌ను బ్లాక్‌లో 200 రూపాయలకు కొంటున్నారు. రాష్ట్రంలో చాలా పెట్రోల్ పంపులు మూసి ఉన్నాయి. తెరిచి ఉన్న కొన్ని రిస్క్ తీసుకుని బ్లాక్‌లో పెట్రోల్ అమ్ముతున్నాయి… దిక్కులేని పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.
55
పెట్రోల్ కోసం రెట్టింపు ధర
ఒకవైపు పెట్రోల్ డీలర్ల నిరవధిక బంద్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా పెట్రోల్ దొరికితే దానికి రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోంది. వెంటనే ప్రభుత్వం పెట్రోల్ డీలర్స్ తో చర్చలు జరిపి బంకులు ఓపెన్ అయ్యేలా చూడాలని… అప్పుడే ఈ దోపిడీ ఆగుతుందని ప్రజలు వాపోతున్నారు.