Rajmarg Yatra App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే చాలు.. టోల్ ఛార్జీల మోతనుండి తప్పించుకోవచ్చు

Published : Jun 28, 2025, 10:51 AM ISTUpdated : Jun 28, 2025, 11:04 AM IST

జాతీయ రహదారులపై దూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఓ మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. దీని ఉపయోగాలేమిటి? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
18
మీ ఫోన్లో రాజ్ మార్గ్ యాత్ యాప్ ఉందా?

Rajmarg Yatra App : మీరు నిత్యం ప్రయాణాలు చేస్తుంటారా? కుటుంబంతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళుతుంటారా? అయితే తప్పకుండా మీ ఫోన్ లో ఓ యాప్ ఉండాల్సిందే. అదే రాజ్ మార్గ్ యాత్రా యాప్. ఇది మీకు ప్రయాణ సమయంలో ఎంతో సహాయపడుతుంది... అలాగే మీ ఖర్చులను కూడా బాగా తగ్గింస్తుంది. ఈ యాప్ ను కేంద్ర ప్రభుత్వ సంస్థ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహిస్తుంది కాబట్టి ఎలాంటి మోసాలు, సైబర్ నేరాల అనుమానం అక్కర్లేదు.

28
రాజ్ మార్గ్ యాప్ ఉపయోగాలు

1. టోల్ ఛార్జీల తగ్గింపు :

సొంత వాహనంలో దూర ప్రయాణాలు చేసేవారు పెట్రోల్ ఖర్చుల గురించి అంతగా బాధపడరు కానీ టోల్ ఛార్జీల గురించి కంగారు పడుతుంటారు. వెళ్లే మార్గంలో ఎన్ని టోల్ గేట్స్ వస్తాయో... ఎంత డబ్బులు వసూలు చేస్తారో... అని ఆందోళన చెందుతుంటారు. ఇక నిత్యం హైవేలపై తిరిగే వాహనదారులకు కూడా టోల్ ఛార్జీల భయం ఉంటుంది. ఇలాంటివారు ఫోన్ లో రాజ్ మార్గ్ యాత్రా యాప్ ను పెట్టుకుంటే ఈ టోల్ చార్జీల భారం తగ్గించుకోవచ్చు.

ఈ రాజ్ మార్గ్ యాత్ర యాప్ మనం వెళ్లే మార్గంలో టోల్ ప్లాజాల వివరాలను తెలియజేస్తుంది. అంతేకాదు ఏ మార్గంలో వెళితే తక్కువ టోల్ ప్లాజాలుంటాయి? ఎక్కడ తక్కువ టోల్ వసూలు చేస్తారు? అనే వివరాలను కూడా తెలియజేస్తుంది. ఇలా ఈ యాప్ లో చూపించే మార్గాన్ని ఫాలో అయితే టోల్ చార్జీలు తగ్గించుకోవచ్చు... తద్వారా ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి.

38
2. హైవే సమాచారం

మనకు తెలియని ప్రాంతాల్లో ప్రయాణించే సమయంలో ఈ రాజ్ మార్గ్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రయాణించే జాతీయ రహదారికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. రోడ్డు పరిస్థితి అంటే రోడ్డు ఎలా ఉంది, ఏవయినా పనులు జరుగుతున్నాయా అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. తద్వారా జాగ్రత్తగా, సురక్షితంగా ప్రయాణం కొనసాగించవచ్చు.

48
3. హైవేపై లభించే సేవలు, సౌకర్యాలు

రాజ్ మార్గ్ యాప్ ద్వారా ప్రయాణించే హైవేపై అందే సేవలు సౌకర్యాల గురించి తెలుసుకోవచ్చు. అంటే పెట్రోల్ పంపులు, ప్రముఖ హోటళ్లు, విశ్రాంతి స్థలాలకు సంబంధించిన వివరాలను ఈ యాప్ తెలియజేస్తుంది. అలాగే అత్యవసర సమయంలో దగ్గర్లోని హాస్పిటల్స్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

58
4. ఫాస్టాగ్ రీచార్జ్

ప్రయాణించే జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వివరాలనే కాదు ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ కూడా ఈ రాజ్ మార్గ్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ముందుగానే ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోకపోయినా టోల్ ప్లాజా దగ్గరపడే సమయంలో ఈ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. తద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు.

68
5. ఫిర్యాదులు

రాజ్ మార్గ్ యాప్ ద్వారా హైవేలపై కేవలం సేవలను పొందడమే కాదు ఏదయినా సమస్య ఎదురైనా ఫిర్యాదులు చేయవచ్చు. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఈ యాప్ లో ఉంటుంది... హైవే అథారిటీ ఆప్ ఇండియా దీన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుటుంది.

78
6. భద్రతా నోటిఫికేషన్

ఈ యాప్ సేఫ్ డ్రైవింగ్ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే వాహనాన్ని ఓవర్ స్పీడ్ తో నడిపితే ఈ యాప్ అలర్ట్ చేస్తుంది… డ్రైవింగ్ లో ఏమాత్రం తేాడా కనిపించినా నోటిఫికేషన్ పంపిస్తుంది.  తద్వారా స్పీడ్ తగ్గించుకుని సురక్షితంగా ప్రయాణించవచ్చు.

88
రాజ్ మార్గ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ యాప్ ను ఇంగ్లీష్ తో సహా మొత్తం 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు Google Play Store ను ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో రాజ్ మార్గ్ యాత్ర యాప్ అని టైప్ చేయాలి. దీనిపై క్లిక్ చేసి డౌన్లోడ్, ఇన్స్టాలేషన్ పూర్తిచేయాలి. ఇలా చాలా ఈజీగా ఈ యాప్ సేవలను పొందవచ్చు.

ఇక యాపిల్ వంటి IOS ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఫోన్లలో యాప్ స్టోర్ ను ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో రాజ్ మార్గ్ యాత్ర అని టైప్ చేయాలి. దీనిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ ను వాడుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories