రాజస్థాన్ : పట్టపగలు, నడిరోడ్డుమీద డాక్టర్ దంపతుల హత్య.. కానీ ట్టిస్ట్ ఏంటంటే..

First Published May 29, 2021, 9:26 AM IST

రాజస్థాన్ లో పట్టపగలు దారుణం జరిగింది. ఓ డాక్టర్ దంపతుల కారును ఆపిన ఇద్దరు దుండగులు వారిని కాల్చి చంపేశారు. శుక్రవారం (మే 28) జరిగిన ఈ ఘటన తాలూకు షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రాజస్థాన్ లో పట్టపగలు దారుణం జరిగింది. ఓ డాక్టర్ దంపతుల కారును ఆపిన ఇద్దరు దుండగులు వారిని కాల్చి చంపేశారు. శుక్రవారం (మే 28) జరిగిన ఈ ఘటన తాలూకు షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బిజెపి నాయకుడు రాజ్యవర్ధన్ రాథోడ్ ఈ వీడియోను షేర్ చేస్తూ అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.
undefined
"రాజస్థాన్‌లో పట్టపగలు ఓ డాక్టర్ దంపతులు కాల్చి చంపబడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి, చట్టంవిరుద్ధమైన ఇలాంటి ఘటనలకు నెలవయ్యింది. ఇదంతా వెన్నెముక లేని రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే జరుగుతుంది. హత్యలు చేస్తూ, నగరాలు, పల్లెల్లో పట్టణాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న నేరస్తుల్ని ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు’ అని ఆయన అన్నారు.
undefined
ఈ సంఘటన భరత్‌పూర్ జిల్లాలో జరిగిందని, నిందితులను అనుజ్, మహేష్‌గా గుర్తించినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది."నిందితులను త్వరగా అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని భరత్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ ప్రషన్ కుమార్ ఖమేస్రా చెప్పారు.
undefined
ఇద్దరు దుండగులు డాక్టర్ సుదీప్ గుప్తా (46), అతని భార్య సీమా గుప్తా (44) ను సెంట్రల్ బస్ స్టాండ్ సమీపంలోని సర్క్యులర్ రోడ్ వద్ద కారులో వెల్తుంటే.. ఆపి కాల్చి చంపారు.మృతులిద్దరి పోస్టుమార్టం ఆర్‌బిఎం ఆసుపత్రిలో నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
undefined
భరత్పూర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లు తెలిపిన వివరాల్ ప్రకారం హత్య చేయబడిన డాక్టర్, అతని భార్య, అతని తల్లికి 2019 నవంబర్లో ఒక మహిళ, ఆమె ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
undefined
ఇప్పుడీ ఘటనకు పాల్పడ్డ నిందితుల్లో ఒకరు (అనుజ్) 2019 నవంబర్‌లో హత్యకు గురైన మహిళకు సోదరుడు.ఆ సమయంలో వారి ఇంటికి నిప్పంటించి ఒక మహిళ, ఆమె ఐదేళ్ల చిన్నారి మృతికి కారణమైనట్లుపోలీసు అధికారి రాజేంద్ర శర్మ తెలిపారు.
undefined
"డాక్టర్ గుప్తాకు ఆ మహిళతో ఎఫైర్ ఉంది. దీంతో ఆమెను అంతం చేయాలనే తల్లి, భార్యతో కలిపి ఆ దారుణానికి ఒడిగట్టాడని అనుమానిస్తున్నారు.’’ అని ఆయన చెప్పారు.
undefined
click me!