Rahul Gandhi Rides Bike: బైక్ రైడర్ అవతారమెత్తిన రాహుల్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..

Published : Aug 19, 2023, 03:23 PM IST

Rahul Gandhi Rides Bike: భారత్‌-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు వద్దకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ బైక్ రైడింగ్ చేస్తూ వెళ్లాడు. ఈ సందర్భంగా "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో పాంగోంగ్ సరస్సు ఒకటని మా నాన్న చెబుతుండేవారు" అని క్యాప్షన్ పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 

PREV
17
Rahul Gandhi Rides Bike: బైక్ రైడర్ అవతారమెత్తిన రాహుల్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..
Rahul Gandhi 1

కాంగ్రెస్ మాజీ అధినేత,  ఎంపీ రాహుల్ గాంధీ నేడు కేంద్ర పాలిత ప్రాంతమైన లే-లడఖ్‌లో పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీ తన పార్టీ నాయకులతో పాటు, లడఖ్‌లోని వివిధ ప్రదేశాలలో యువతను కలిసి వారితో సంభాషించనున్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ ఓ డిఫరెంట్ స్టైల్లో ప్రొఫెషనల్ బైక్ రైడర్ గా  కనిపించి అందర్నీ ఆశ్యర్చపరిచాడు. 

27

ఈ రోజు ఉదయం రాహుల్ గాంధీ రైడర్ లుక్‌లో కనిపించారు. ప్యాంగాంగ్ లేక్ వద్దకు బైక్ పై బయలుదేరారు. KTM బైక్, స్పోర్ట్స్ హెల్మెట్‌ ధరించి రాహుల్ లడఖ్ రోడ్లపై బైక్ రైడింగ్ చేశారు. 

37
Rahul Gandhi 1

రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను పంచుకుంటూ.. “పాంగాంగ్ సరస్సుకు వెళ్లే మార్గంలో.. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి అని మా నాన్న చెబుతుండేవారు” అని క్యాప్షన్ పెట్టారు. ఇందుకు  సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

47

రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను పంచుకుంటూ.. “పాంగాంగ్ సరస్సుకు వెళ్లే మార్గంలో.. ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి అని మా నాన్న చెబుతుండేవారు” అని క్యాప్షన్ పెట్టారు. ఇందుకు  సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

57
Rahul Gandhi 1

లేహ్‌లోని తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాంగోంగ్ సరస్సు వద్ద రాహుల్ గాంధీ నివాళులర్పిస్తారు. 1944 ఆగస్టు 20న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజును గుడ్ విల్ డేగా జరుపుకుంటుంది.

67
Rahul Gandhi 1

ఈ సందర్భంగా లడఖ్‌లో వేర్పాటువాదంపై రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సంభాషించారు. కొందరు రాజకీయ వ్యక్తులు దేశంలో విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. మీరు భారతదేశానికి వెళితే, ప్రజల మధ్యకు వెళితే, ప్రజలు ఒకరినొకరు ప్రేమగా మరియు గౌరవంగా చూస్తారు.

 

77
Rahul Gandhi 1

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి విడిపోయిన తర్వాత కొత్త కేంద్ర పాలిత ప్రాంతాన్ని  రాహుల్ గాంధీ సందర్శించడం ఇదే తొలిసారి. 

Read more Photos on
click me!

Recommended Stories