బెంగళూరులో టమాటా దొంగలు... రూ. 37వేల విలువైన 550కిలోలు చోరీ..

Published : Aug 18, 2023, 11:28 AM IST

బెంగళూరులో టమాటా దొంగలు హల్ చల్ సృష్టిస్తున్నారు. ఓ దుకాణంలోనుంచి దాదాపు 550కిలోల టమాటాలను దొంగిలించారు. 

PREV
18
బెంగళూరులో టమాటా దొంగలు... రూ. 37వేల విలువైన 550కిలోలు చోరీ..

బెంగళూరు : గత కొద్దికాలంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో టమాటాల నేపథ్యంగా దొంగతనాలు, హత్యలుకూడా చోటు చేసుకున్నాయి. ఇటీవల కొన్నిప్రాంతాల్లో టమాటా ధరలు కాస్త దిగివస్తున్నాయి. అయినా, టమాటా దొంగతనాలు మాత్రం ఆగడం లేదు.  

28

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో తాజాగా టమాటా దొంగలు 550కి.లోల టమాటాలు ఎత్తుకెళ్లారు. ఈ గటన ఆగస్టు 12 తెల్లవారుజామున ఉల్సూర్‌లోని మర్ఫీ టౌన్‌లో రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణంలో చోటు చేసుకుంది. 

38

ఇద్దరు వ్యక్తులు రూ.37,500 విలువ చేసే సుమారు 550 కిలోల టమోటాలు దొంగిలించారు. మర్ఫీ టౌన్‌కు చెందిన వ్యాపారి ప్రశాంత్ టి (30) దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఆగస్టు 11 మధ్యాహ్నం 1గంట సమయంలో శివాజీనగర్ మార్కెట్ నుండి 22 కిలోలుండే.. 30 క్రేట్ల టమాటాలను కొనుగోలు చేశాడు. మర్ఫీ టౌన్ మార్కెట్‌లోని తన స్టాల్‌లో వాటిని దించేశాడు.

48

కొన్న తరువాత ఒక రోజు ఐదు క్రేట్ల టమాటాలను అమ్మాడు. ఆ రోజు రాత్రి 11గంటల ప్రాంతంలో ఇంటికి వెళుతూ.. డబ్బాలను టార్పాలిన్‌ షీట్‌తో కప్పి తాళ్లు కట్టాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరిగి వచ్చి చూసేటప్పటికి.. అమ్మగా మిగిలిన 25 క్రైట్ల టొమాటోలు కనిపించలేదు. అవి దొంగిలించబడినట్లు అతను కనుగొన్నాడు.

58

అనుమానితుల కోసం పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్న ప్రశాంత్, ఇతర వ్యాపారులు ఒక దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఆగస్టు 12వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఆటోరిక్షాలో వచ్చి దుకాణం ముందు వాహనాన్ని పార్క్ చేస్తున్నట్టు గుర్తించారు. 

68

వారిలో ఒకరు ఎవరైనా వస్తున్నారా అని చూస్తూ కాపలా కాయగా... మరొకరు డబ్బాలను ఆటోలో ఎక్కించారు. డబ్బాలు పూర్తిగా ఆటోలోకి ఎక్కగానే అక్కడినుంచి పారిపోయారు. అది చూసిన ప్రశాంత్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

78

ఆగస్ట్ 15న, దుకాణం దగ్గర ఒక బాలుడు సంచరిస్తున్నట్లు విక్రేతల బృందం గుర్తించింది. అతన్ని పట్టుకుని ప్రశాంత్‌కు సమాచారం అందించారు. స్నేహితుడి సహాయంతో నాలుగు రోజుల క్రితం టమాటా దొంగిలించినట్లు బాలుడు అంగీకరించాడని వ్యాపారులు తెలిపారు. 
"బాలుడిని ఉల్సూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాం" అని ఒక వ్యాపారి చెప్పాడు. ఆ రోజే దీనిమీద ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలుడి  వయస్సు 15 సంవత్సరాలు. అతడిని విచారించగా... రాష్ట్ర బాలుర గృహం నుండి తప్పించుకుని, తన తల్లిని వెతుక్కుంటూ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

88

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలుడు ఆగస్టు 14న ఇంటి నుంచి పారిపోయాడని, టమాటా చోరీతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. "అతన్ని మడివాలా పోలీసులకు అప్పగించాం. వారు ఆ బాలుడిని తిరిగి ఇంటికి పంపించారు" అని ఒక సీనియర్ పోలీసు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించడం లేదని, వారిద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories