‘కల్చర్.. క్రియేటివిటీ.. సెలబ్రేషన్’ (సంస్కృతి.. సృజనాత్మకత.. వేడుకలు) అనే ప్రధాన ఇతివృత్తంతో పాండీ మెలాంజ్ కార్యక్రమాలను రూపొందించారు. ఇందులో కళలు, సంగీతం, ఫ్యాషన్, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, వారసత్వ సంపద, వినోదానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పుదుచ్చేరి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు స్థానికంగా ఉన్న పర్యాటక ఆకర్షణలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
జనవరిలో విద్య, ఆధ్యాత్మికత, వైద్య రంగాలపై సదస్సులు
పాండీ మెలాంజ్ 2027లో భాగంగా జనవరిలో విద్య, ఆధ్యాత్మికత, వైద్య రంగాలకు సంబంధించిన సదస్సులను నిర్వహించనున్నారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులు, వృత్తి నిపుణులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొంటారు. తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు ఆయా రంగాల్లోని ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాలు అడ్డాగా నిలవనున్నాయి.