క‌న్యాకుమ‌రీలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ లో రెండు రోజుల పాటు ధ్యానంలో ప్ర‌ధాని మోడీ

Published : May 30, 2024, 09:27 PM IST

Prime Minister Narendra Modi : లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానందకు నివాళులర్పిస్తూ 45 గంటల పాటు ధ్యానంలో కూర్చుంటున్నట్టు ప్రకటించారు.  

PREV
17
క‌న్యాకుమ‌రీలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ లో రెండు రోజుల పాటు ధ్యానంలో ప్ర‌ధాని మోడీ
Narendra Modi

PM Modi Kanyakumari visit : లోక్‌సభ ఎన్నికల 2024 బహిరంగ ప్రచారం గురువారంతో ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ త‌మిళ‌నాడులోని దక్షిణ కన్యాకుమారిలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అక్క‌డ రెండు రోజుల పాటు ధ్యానంలో ఉండ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

27
Narendra Modi

2024 లోక్‌సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్నారు.

37

ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 1 వరకు కన్యాకుమారిలో ఉంటారు. 2014, 2019 లాగే ఈసారి కూడా ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారి చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. పూజలు నిర్వహించి పూజారి నుంచి ప్రసాదం స్వీకరించారు. 

47

భగవతి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, ప్రధాని మోడీ రాక్ మెమోరియల్‌ని సందర్శించి స్వామి వివేకానంద విగ్ర‌హానికి నివాళులర్పించారు. మోడీ ఇక్క‌డ రెండు రోజుల పాటు ధ్యానం చేయనున్నారు.

57

మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు మోడీ ధ్యాన మండపంలో ఉంటారు. ఇక్కడే ఆయన ధ్యానం చేయబోతున్నారు.

67
Kanyakumari visit

కన్యాకుమారిలో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఇక్కడ అతను భారతదేశం, భారతీయత పట్ల ప్రత్యేక ప్రేమను పెంచుకున్నారు. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్‌కు ప్రత్యేక స్థానం ఉన్నట్లే, స్వామి వివేకానంద జీవితంలో కన్యాకుమారి ప్రాంతానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది.

77
Narendra Modi

స్వామి వివేకానంద దేశవ్యాప్తంగా పర్యటించి మూడు రోజుల పాటు ధ్యానం చేసిన తర్వాత ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి యువతను మేల్కొలిపి దేశ పునర్నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ దేశమంతా పర్యటించారు.

Read more Photos on
click me!

Recommended Stories