PM Modi: కాషాయమయం అయిన వారణాసి.. ప్రధాని నరేంద్ర మోడీ భారీ రోడ్‌ షో..

First Published | May 13, 2024, 9:02 PM IST

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్‌ వేసే ముందు సోమవారం కాశీలో గ్రాండ్‌గా రోడ్‌ షో నిర్వహించారు. ప్రధాని మోదీ రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.  

PM Modi:సార్వత్రిక సమరం తుది దశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందనీ, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానిమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే పలు సర్వేలు, నివేదికలు అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రధాని మోడీ యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం వారణాసిలో భారీ రోడ్‌షో నిర్వహించారు. 


మోడీ రోడ్‌షో ప్రారంభించడానికి ముందు లంక ప్రాంతంలోని మాలవ్య చౌరస్తా వద్ద ఉన్న విద్యావేత్త, సంఘ సంస్కర్త మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి ప్రధాని మోడీ పూలమాల వేసి నివాళులర్పించారు. 

నామినేషన్‌ వేసే ముందు ప్రధాని మోడీ సోమవారం కాశీలో గ్రాండ్‌గా రోడ్‌ షో నిర్వహించగా..ప్రధాని మోడీ వెంట ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రోడ్‌షోలో పాల్గొన్నారు.ఈ క్రమంలో ప్రధానికి స్వాగతం పలికేందుకు ముస్లిం మహిళలు కూడా ముందుకు వచ్చారు. ప్రధాని మోదీ రోడ్‌షో చూసేందుకు చిన్నారులు సైతం వచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రజల అభినందనలు స్వీకరించారు. వారణాసిలోని గొదౌలియా కూడలిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు షో మొత్తం కాషాయమయంగా మారింది. రోడ్ షోలో ప్రజలు ఉత్సాహంగా కనిపించారు. 

ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు నిర్మించిన వేదికపైకి ఎక్కి హర్ హర్ మోదీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రధాని మోదీని చూసేందుకు రోడ్‌షో మార్గంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫేస్‌బుక్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోడ్ షో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

Latest Videos

click me!