ప్రయాగరాజ్ మహాకుంభ రాత్రి దృశ్యాలు మనసును హత్తుకుంటున్నాయి. దేశ విదేశాల నుండి కుంభమేళాకు తరలివచ్చిన ప్రజలు గంగానది ఒడ్డున నిలబడి ఈ రాత్రి అందాలను చూసి మైమరచిపోతున్నారు.
ఎన్నోరోజులుగా భారతదేశంలోని మెజారిటీ హిందూ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా ప్రారంభమై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళాలో ఇప్పటికే ఐదు కోట్లమందికి పైగా గంగానదిలో స్నానం ఆచరించారు. ఈ మహాకుంభంలో పాల్గొనేందుకు దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు.
25
Prayagraj Kumbhmela 2025
ఇలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రయాగరాజ్ అందాలను ఏసియా నెట్ గ్రూప్ కెమెరాల్లో బంధిస్తోంది. వీటిలో అద్భుతమైనవి, కనులకు విందుచేసే వాటిని ప్రేక్షకులకు అందిస్తోంది. ఇలా రాత్రివేళ కుంభమేళా అందాలను బంధించి మీకు అందిస్తున్నాం.
35
Prayagraj Kumbhmela 2025
రాత్రివేళ ఆకాశం నుండి తీసిన మహాకుంభం ఫోటోలు నిజంగా మనసును హత్తుకుంటాయి. ఈ ఫోటోలో ఎంత అందమైన, మంత్రముగ్ధులను చేసే దృశ్యం ఉందో చూడండి.
45
Prayagraj Kumbhmela 2025
మహాకుంభం పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా ప్రజలను ఆకర్షిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఫోటో ఆ విషయాన్ని రుజువు చేస్తోంది.
55
Prayagraj Kumbhmela 2025
ప్రయాగరాజ్‌లోని అందమైన మేళా ప్రాంగణం ఒక అద్భుతమైన, అందమైన కథను చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలను చూస్తే మీరు కూడా హర్ హర్ గంగే అని భక్తితో మైమరిచి అరుస్తారు.