ఒకే రోజులో 70 లక్షల నుండి 3.5 కోట్లకు పెరిగిన జనాభా..! ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేసిన ఇండియన్ సిటీ

First Published | Jan 16, 2025, 5:49 PM IST

ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల నగరం టోక్యో... ఆ రికార్డును కేవలం ఒకే ఒక్కరోజులో ప్రయాగరాజ్ నగరం బద్దలుగొట్టింది. మహా కుంభమేళా సందర్భంగా ఒక్క జనవరి 14న ప్రయాగరాజ్ లో ఎంతమంది వున్నారో తెలుసా? 

Prayagraj Maha Kumbhmela 2025

Prayagraj Maha Kumbhmela 2025 : ప్రస్తుతం ఇండియాలోని మెజారిటీ హిందువుల అడుగులు ప్రయాగరాజ్ వైపు పడుతున్నాయి. పవిత్ర గంగా,యమునా, సరస్వతి నదుల (త్రివేణి) సంగమంలో 144 ఏళ్లకోసారి వచ్చే పవిత్రమైన రోజుల్లో స్నానం చేస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని... పుణ్యం వస్తుందని హిందువుల విశ్వాసం. ఇదే కొన్ని దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువమంది కేవలం ఓ నగరంలోనే   గుమిగూడేలా చేస్తోంది. ఇలా కేవలం హిందువులనే కాదు ఇతర మతాలు, చివరకు ఇతర దేశాలను కూడా ఆకర్షిస్తోంది ప్రయాగరాజ్ మహా కుంభమేళా.  

ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా వరల్డ్ రికార్డ్స్ బద్దలుగొట్టడం ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకగా కుంభమేళా ప్రసిద్ది చెందింది. తాజాగా ప్రయాగరాజ్ ప్రపంచలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో ప్రయాగరాజ్ చేరిపోయింది. కేవలం ఒక్కరోజులోనే ఈ నగర జనాభా 3.5 కోట్లకు పెరిగింది...   కుంభమేళా సందర్భంగా ఇలాంటి అద్భుత రికార్డులు నమోదవుతున్నాయి. 
 

Prayagraj Maha Kumbhmela 2025

ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల నగరంగా ప్రయాగరాజ్ : 

ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరం జపాన్ లోని టోక్యో. ఈ నగర జనాభా 3.74 కోట్లు. అయితే మహా కుంభమేళా 2025 సందర్భంగా టోక్యో రికార్డును ప్రయాగరాజ్ బ్రేక్ చేసింది. కేవలం జనవరి 14 సంక్రాంతి రోజున ప్రయాగరాజ్ జనాభా ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.  

జనవరి 14న మహా కుంభమేళాలో మొదటి పవిత్ర స్నానదినం... అంటే కుంభమేళాలో ఆరు పవిత్ర స్నాన రోజులుంటే అందులో ఇది  ఒకటి. ఈ రోజున గంగా, యమనా, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానం కోసం కోట్లాదిమంది భక్తులు, పర్యాటకులు హాజరయ్యారు. ఇక కుంభమేళా ప్రారంభానికి ముందే లక్షలాదిమంది సన్యాసులు, మునులు ప్రయాగరాజ్ చేరుకున్నారు. ఇలా కేవలం సంక్రాంతి ఒక్కరోజే దాదాపు 3.50 కోట్ల మంది పవిత్ర స్నానం ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం చెబుతోంది. 

అంటే జనవరి 14న ప్రయాగరాజ్ లో బయటనుండి వచ్చిన భక్తులు, పర్యాటకులు, సన్యాసులు, మునులు అంతా కలిపి 4 కోట్ల మంది వుంటారు. వీరికితోడు ప్రయాగరాజ్ లో స్థిరనివాసం కలిగిన జనాభా  మరో 70 లక్షలు. మొత్తంగా ఒక్కరోజు ప్రయాగరాజ్ లో 4.70 నుండి 5 కోట్ల మంది వున్నారన్నమాట. అంటే టోక్యో కంటే ఎక్కువమంది ప్రయాగరాజ్ వున్నారన్నమాట. ఇలా వన్డే వరల్డ్ మోస్ట్ పాపులేటెడ్ సిటీగా ప్రయాగరాజ్ చరిత్ర సృష్టించింది. 


Prayagraj Maha Kumbhmela 2025

మరో చరిత్రకు ప్రయాగరాజ్ సంసిద్దం : 

కేవలం 3.50 కోట్లమంది ఒకేరోజు ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొని సంగమస్నానం ఆచరిస్తేనే ఆశ్చర్యంగా వుంది. అలాంటిది రాబోయే మౌని అమావాస్య రోజున అయితే రికార్డులన్ని బద్దలవుతాయని అంచనా వేస్తున్నారు... ఆ ఒక్కరోజే 8 నుండి 10 కోట్ల మంది సంగమ స్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రయాగరాజ్ సిద్దమవుతోంది.

ప్రయాగరాజ్ కుంభమేళాలో మౌని అమావాస్యను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈసారి ఇది జనవరి 29న  వస్తోంది. ఈ రోజున కుంభమేళాకు అత్యధిక భక్తులు వస్తారని భావిస్తున్నారు. దీంతో ఈ రోజుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షించారు. కుంభమేళా అధికారులకు సీఎం యోగి దిశానిర్దేశం చేసారు... ఏర్పాట్లను మెరుగుపరచాలని ఆదేశించారు.

నిన్న (బుధవారం) ఉన్నతాధికారులతో సీఎం యోగి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పౌష పూర్ణిమ, మకర సంక్రాంతి పండుగల సందర్భంగా 6 కోట్లకు పైగా ప్రజలు త్రివేణి స్నానం ఆచరించారని ఆయన గుర్తు చేశారు. ఇక మౌని అమావాస్య రోజున 8-10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నందున ఏర్పాట్లను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు.

రైల్వే అధికారులతో సంప్రదించి మహాకుంభ్ ప్రత్యేక రైళ్లను సకాలంలో నడపాలని... సాధారణ రైళ్లలో కూడా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చూడాలని సూచించారు. భక్తుల సంఖ్యను బట్టి రైళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని ఆదేశించారు. మేళా ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచాలని, బస్సులు, షటిల్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నిరంతరం నడపాలని సూచించారు. 

శౌచాలయాలను శుభ్రంగా ఉంచాలని, ఘాట్‌ల వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, అన్ని ప్రాంతాల్లో 24×7 విద్యుత్, తాగునీటి సరఫరా ఉండేలా చూడాలని సీఎం యోగి ఆదేశించారు. మొత్తంగా కుంభమేళాలో అత్యధిక ప్రజలు హాజరయ్యే మౌని అమావాస్య రోజున మరింత అప్రమత్తంగా వుండాలని... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తపడాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. 

Latest Videos

click me!