Supreme Court Jobs
Supreme Court Jobs: భారత అత్యున్నత న్యాాయస్థానం సుప్రీంకోర్టులో ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం. లా క్లర్క్-కమ్-రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సుప్రీం కోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ఆరంభమైంది కాబట్టి అర్హులైన అభ్యర్థులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7, 2025... పరీక్ష మార్చి 9, 2025న జరుగుతుంది.
సుప్రీంకోర్టులో ఉద్యోగాన్ని సాధిస్తే జీతమెంతో తెలుసా?
సుప్రీంకోర్టు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం... ఈ నియామకాల ద్వారా 2025-2026 సంవత్సరానికి షార్ట్-టర్మ్ కాంట్రాక్టు ప్రాతిపదికన 90 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹80,000 జీతం లభిస్తుంది.
విద్యా అర్హతలు
- అభ్యర్థులు లాలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతో సహా) కలిగి ఉండాలి.
- డిగ్రీ భారతీయ బార్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఉండాలి.
అవసరమైన నైపుణ్యాలు
- పరిశోధన మరియు విశ్లేషణాత్మక రచనలో నైపుణ్యం.
- ఆన్‌లైన్ లీగల్ రీసెర్చ్ టూల్స్ e-SCR, Manupatra, SCC Online, LexisNexis మరియు Westlaw వంటి వాటిపై అవగాహన.
వయోపరిమితి
- అభ్యర్థుల వయస్సు 20 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి (ఫిబ్రవరి 2, 2025 నాటికి).
ఎంపిక ప్రక్రియ
ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది-
- ఆబ్జెక్టివ్-టైప్ రాత పరీక్ష: చట్టపరమైన జ్ఞానం మరియు అవగాహనను అంచనా వేయడం.
- సబ్జెక్టివ్ రాత పరీక్ష: విశ్లేషణ మరియు రచనా నైపుణ్యాలను పరీక్షించడం.
- వ్యక్తిగత ఇంటర్వ్యూ.
- రాత పరీక్షలు (పార్ట్ I మరియు II) ఒకే రోజున భారతదేశంలోని 23 నగరాల్లో నిర్వహించబడతాయి.
ఈ నియామకాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in ను సందర్శించండి.